నవంబర్ 19 విడుదల కానున్న రేంజ్ రోవర్ ఎవోక్
రేంజ్ రోవర్ అదేనండి బ్రిటిష్ కు చెందిన ప్రముఖ ల్యాండ్ రోవర్ ఆటోమొబైల్ సంస్థకు చెందిన రేంజ్ రోవర్ ఎవోక్ యస్‌యు కారును ఈ నెల 19 భారత్‌లో విడుదల చేయనున్నారు.
ఈ రేంజ్ రేవర్ ఎవోక్ కొన్ని కొత్త సొబగులతో వచ్చిందట. దీని విశేషాలను క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

ఎక్స్‌స్టీరియర్
ఈ కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ఫేస్‌లిఫ్ట్ యస్‌యువి కారు ముందు భాగాన కొత్త బంపర్, రోపలికి ఎక్కువగా గాలిని గ్రహించే ఆకారం, కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్, మరియు కొత్త ఆడాప్టివ్ హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి.

మల్టీమీడియా
ఈ రేంజ్ రోవర్ ఎవోక్ లో 8-అగుళాల పరిమాణం గల తాకే తెర, ఇన్ కంట్రోల్ టచ్, మరియు కొత్త టియఫ్‌టి డిస్ల్పే కలదు.

ఇంటీరియర్
ఈ ఎవోక్ ఫేస్ లిఫ్ట్ కారు లోపలి భాగాన గల సీట్లు ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సీట్లను సుతి మెత్తని క్లాత్‌తో తయారు చేశారు. మరియు దీని ఇంటీరియర్ విభిన్న రంగుల్లో లభించనుంది.

ఫీచర్స్
- ఆల్ టెర్రానొ ప్రొగ్రెస్ కంట్రోల్
- హ్యాండ్స్ ఫ్రీ టెయిల్ గేట్ ఆపరేషన్
- హెడ్ అప్ డిస్ల్పే (హెచ్‌యుడి)
- సరౌండ్ కమెరా సిస్టమ్
- 17 స్పీకర్లు గల ఆడియో సిస్టమ్ మరియు
- రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్
- అగ్ని ప్రమాదానికి గురైన బోయింగ్ విమానం: అసలేం జరిగింది.

భద్రత
ఇందులో భద్రత సంభందించి కొన్ని అధునాతనమైన ఫీచర్లు ఉన్నాయి.అవి లేన్-కీపింగ్ అసిస్ట్, అటానస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు డ్రైవర్ నిర్లక్ష్యంగా వహిస్తే మేల్కొలిపే టెక్నాలజీ వంటి కొత్తవి ఎన్నో ఇందులో ఉన్నాయి.

ఇంజన్
రేంజ్ రోవర్ ఎవోక్ ఫేస్‌లిఫ్ట్ కారులో 2.2-లీటర్ గల ఇంజన్ ఉంది. ఇది దాదాపుగా 187 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ 9-స్పీడ్ గేర్ బాక్స్‌తో కనెక్ట్ అయిఉంది.

ధర
ఈ రేంజ్ రోవర్ ఎవోక్ ఫేరస్ లిఫ్ట్ ధర మన దేశంలో దాదాపుగా 57 లక్షల వరకు ఉండనుంది. ఇది ఆన్-రోడ్ ధర ఎక్స్-షోరూమ్,డిల్లీ గా అంచనా.



Click it and Unblock the Notifications








