7-సీటర్ కాంపాక్ట్ కారును విడుదల చేయనున్న రెనొ
రెనొ క్విడ్ ఇప్పడిప్పుడే భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటోది. అందుకే దేశీయంగా ఆటోమొబైల్ మార్కెట్లో మరింత ప్రాబల్యాన్ని పెంచుకునేందు రెనొ ఇండియా మార్కెట్లోకి సరి కొత్త 7- సీటర్ కాంపాక్ట్ యస్‌యువి ని విడుదల చేయనుంది.
Also Read: పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో వస్తున్న 7 సీటర్ వ్యాగన్‌ఆర్
Also Read: మహీంద్ర నుండి ఎనిమిది సీట్ల మిని వ్యాన్ మరియు ట్రక్
రెనొ వారి 7-సీటర్ కాంపాక్ట్ యస్‌యువి గురించి మరిన్ని విషయాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం......

7-సీటర్ రెనొ కాంపాక్ట్ యస్‌యువి రెండు ఇంజన్ వేరియంట్లలో మన ముందుకు రానుంది. అవి పెట్రోల్ మరియు డీజల్ ఇవి పూర్తిగా రెనొ వారి క్యాప్చర్ మోడల్ కు చెందిన ఇంజన్‌లుగా తెలుస్తోంది.

ఈ 7-సీటర్ రెనొ కాంపాక్ట్ యస్‌యువి ని అంతర్జాతీయ విపణిలో అందుబాటులోకి తీసుకురావడానకి, ఇప్పుడు మంచి గుర్తింపు తెచ్చకున్న రెనొ క్యాప్ఛర్ వంటి డిజైన్‌ను దీనికి అన్వయించాలని దీనిని రూపొందిస్తున్న ఇంజనీర్లు అంటున్నారు.

దీనిని 2016 సంవత్సరం మద్యలో దీనిని పారిశ్రామికంగా తయారి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్‌కు రెనొహెచ్‌హెచ్‌ఎ (Renault HHA) గా నిర్ణయించారు.

ఈ కాంపాక్ట్ యస్‌యువి ని క్యాప్చర్ కారు యొక్క ముందు మరియు వెనుకవైపున గల ఆకర్షణీయమైన గల డిజైన్‌తో దీనిని తీర్చిదిద్దనున్నారు. ఇది భారత్‌లో మంచి గుర్తింపును పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ 7-సీటర్ కాంపాక్ట్ యస్‌యువి కారు ఇండియన్ మార్కట్‌కు వచ్చిందంటే. ఇప్పుడు మార్కెట్లో ఉన్న మహీంద్ర ఎక్స్‌యువి 500 కి గట్టి పోటిని ఇవ్వగలదు మరియు టాటా వారు త్వరలో విడుదల చేయనున్న హెక్సా మోడల్‌కు కూడా పోటిగా నిలవనుంది.

రెనొ వారు దీనిని ఇండియాకు 2017 ప్రారంభంలో పరిచయం చేయనున్నారు. ఇప్పటికే పరిచయం చేసిన క్విడ్ ఎంతో మంచి ఆదరణ పొందుతోంది.

ఆశ్చర్యకరమైన మరియు ఆశక్తికలిగించే మరిన్ని ఆటోమొబైల్ విషయాలు తెలుసుకోండి


Click it and Unblock the Notifications








