రెనొ డస్టర్ మీద ఆకర్షణీయమైన దీపావలి ఆఫర్లు మరియు డిస్కౌంట్లు
ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారిదారులైన రెనొ భారత్‌లో తమ డస్టర్ మోడల్ మీద ప్రత్యేకమైన దీపావలి ఆఫర్‌లను ప్రకటించింది. ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ వ్యాపార ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న రెనొ కారు డస్టర్. అందువలన ఈ దీపావలి సీజన్‌లో మరిన్ని డస్టర్ అమ్మకాలు సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది.
Also Read: మీ నగరంలో రెనో డస్టర్ ధరలను తెలుసుకోండి.
డస్టర్ మీద 4.99 ప్రత్యేక వడ్డీ రేటును ప్రకటించింది. దాదాపుగా 45,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించింది మరియు అదనంగా స్టాక్‌లో ఉన్న వాటిని ఎంచుకోవడం ద్వారా 25,000 రుపాయల వరకు లాభం పొందే అవకాశం ఉంది. కార్పోరేట్ డిస్కౌంట్ క్రింద 6,000 వరకు ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు.
Also Read: ఈ దీపావలి కోసం ఉత్తమ ఆఫర్లను ప్రకటించిన కార్లు
ప్రస్తుతం రెనొ డస్టర్ భారత్‌లో మూడు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్-(102బిహెచ్‌పి, 145ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది). మరియు ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.
1.5-లీటర్ డీజల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ గల ఇంజన్ 84బిహెచ్‌పి, 200 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. అదేవిధంగా 6-స్పీడ్ గేర్ బాక్స్ గల 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 108బిహెచ్‌పి మరియు 200ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.



Click it and Unblock the Notifications








