190 వ డీలర్‌షిప్‌ను తెలంగాణలో ప్రారంభించిన రెనొ ఇండియా

దేశీయంగా కాస్త మెరుగైన ఫలితాలు నమోదు చేసుకుంటుంన్న కార్ల తయారీ సంస్థలలో రెనొ ఒకటి. రెనొ ఈ మద్యనే క్విడ్ కారును మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఇప్పుడు ఇది విశేప్రజాదరణ పొందుతోంది. కాని దీనికి ఇప్పుడున్న సమస్య ఏంటంటే అతి తక్కువ డీలర్లను కలిగి ఉండటం. అందువలన రెనొ ఇండియా దేశ వ్యాప్తంగా షోరూమ్‌లను మరియు సర్వీస్ సెంటర్లును ప్రారంభిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో తన 190 వ డీలర్‌షిప్‌ను ప్రారంభించింది.
Also Read: మీ నగరంలో రెనొ కంపెనీ కార్ల ధరలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ షోరూమ్‌ను రెనొ ఇండియా యొక్క సేల్స్ మరియు మార్కెటింగ్ విభాగాధిపతి అయిన రఫెల్ ట్రిగర్ ప్రారంభించారు. ఈ షోరుమ్ యొక్క చిరునామా: సర్వే నెంబరు.445-446, హైదరాబాద్ మెయిన్ రోడ్, కరీంగనగర్ మరియు దీని వర్క్ షాపు ప్లాట్ నెంబర్.124, సర్వే నెంబర్.625 మరియు 626, ప్లాట్ నెంబర్. 113/ఎ, రాజీవ్ ఆటోనగర్‌లో ఉంది.

ఈ షోరూమ్‌తో కలిపి దేశ వ్యాప్తంగా మొత్తం 190 సేల్స్ మరియు 151 సర్వీసింగ్ ఔట్‌‌లెట్లను, దక్షణ భారత దేశంలో దాదాపుగా 52 షోరూమ్‌లు మరియు 37 సర్వీస్ సెంటర్లు కలిగి ఉన్నట్లు రెనొ ఇండియా ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపుగా 80 శాతం వరకు రెనొ ఇండియా విస్తరించిందని పేర్కొన్నారు.
వీటిని కూడా చదవండి:

Article Published On: Tuesday, November 24, 2015, 10:19 [IST]
English summary
Renault Inaugurates 190th Indian Dealership In Telangana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+