ఫాల్టీ ఎయిర్‌బ్యాగ్స్: భారత్‌లో 646 రెనో వాహనాల రీకాల్!
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న వాహనాలలో ఎయిర్‌బ్యాగ్స్ సమస్య కారణంగా 646 కార్లను రీకాల్ చేయనుంది. కంపెనీ విక్రయించిన పల్స్ హ్యాచ్‌బ్యాక్, స్కాలా సెడాన్ కార్లలో ఈ సమస్యను గుర్తించినట్లు సమాచారం.
సెప్టెంబర్ 2011 నుండి జులై 2012 మధ్యలో ఉత్పత్తి అయిన రెనో పల్స్, రెనో స్కాలా మోడళ్లలోని లోపపూరితమైన ఎయిర్‌బ్యాగ్స్‌ను సరిచేసేందుకు రెనో ఇండియా ఈ రీకాల్‌ను ప్రకటించనుంది. ఈ కార్లలో టకటా నుంచి గ్రహించిన ఎయిర్‌బ్యాగ్స్ ఉపయోగించారు.

కేవలం రెనో కంపెనీనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆటోమొబైల్ కంపెనీలకు జపాన్‌కి చెందిన టకటా సంస్థే ఎయిర్‌బ్యాగ్స్‌ను సప్లయ్ చేస్తోంది. ఈ కంపెనీ ఎయిర్‌బ్యాగ్స్ ఉపయోగించిన కార్లలో, ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్స్ అధిక తీవ్రతో విచ్చుకొని ప్రయాణీకులకు హాని కలిగించవచ్చనే సమాచారంతో అనేక అన్ని కార్ కంపెనీలు లక్షల సంఖ్యలో తమ వాహనాలను వెనక్కి పిలిస్తున్నాయి.
ఈ రీకాల్‌కు వర్తించే కార్లలో 620 పల్స్ హ్యాచ్‌బ్యాక్‌లు, 26 స్కాలా సెడాన్లు ఉన్నాయి (వాస్తవానికి ఇవి రెండు కూడా నిస్సాన్ అందిస్తున్న మైక్రా, సన్నీ సెడాన్లకు రీబ్యాడ్జ్ వెర్షన్లే). ఈ రీకాల్‌కు సంబంధించి తాము తమ కస్టమర్లను సంప్రదిస్తున్నామని, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లో ఏదైనా లోపాన్ని గుర్తిస్తే, ఉచితంగా దానిని సరిచేస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.



Click it and Unblock the Notifications








