రెనొ క్విడ్ మరియు హ్యుందాయ్ ఇయాన్‌ల మధ్య పెరిగిన పోటి.

By Anil

ఎంట్రిలెవల్ సెగ్మెంట్‌లో వచ్చిన కొత్త కారు రెనొ క్విడ్. క్విడ్ యొక్క డిజైన్ మరియు ఫీచర్లు లాంటి ఎన్నోఅధునాతనమైన కొత్త సొబగులతో వచ్చి భారత మోర్కెట్లో ఎవరూ ఊహించని బుగింగ్స్ నమోదు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు: చరిత్రను తిరగరాసిన రెనొ క్విడ్ బుకింగ్స్.

భారతదేశపు ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తు వచ్చిన మారుతి ఆల్టో 800 ని పక్కకు నెట్టేసింది దీనిని వలన ఇప్పుడు ఆల్టో 800 మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. ఆల్టో కారునే కాదు ఇప్పుడు హ్యుందాయ్ ఇయాన్ ని కూడా కూల్చేసే పథకంలో ఉంది.
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు: మారుతి ఆల్టో 800 ని చంపేసిన రెనొ క్విడ్! ఎందుకు, ఏమైంది?

రెనొ క్విడ్ మరియు హ్యుందాయ్ ఇయాన్ లను పోల్చి వాటి మధ్య గల డిజైన్, ఫీచర్స్, ధర మరియు పనితీరు గురించి క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం.....
Also Read: రెనొ క్విడ్ యొక్క ప్రయోజనాలు, నష్టాలు కొరకు...

ధర :

ధర :

రెనొ క్విడ్ యొక్క ప్రారంభ ధర రూ. 2,61,592 నుండి మొదలు.

హ్యుందాయ్ ఇయాన్ ప్రారంభ ధర రూ. 3,08,865 నుండి మొదలు.(రెండు ధరలు ఎక్స్‌ షో-రూమ్ హైదరాబాద్).

ధర కోసం: మీ నగరంలో రెనొ క్విడ్ ఆన్‌-రోడ్ ధరలు తెలుసుకోండి.

డిజైన్ :

డిజైన్ :

రెనొ క్విడ్ :

చాలా వరకు ఎక్కువ మంది డిజైన్ చూసి కారును ఎంచుకుంటున్నారు. చూడగానే ఆకట్టుకునే దీని ముందువైపు గల బోల్డ్ స్టేన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిని రెనొ డస్టర్ ప్రేరణతో తయారు చేసినట్లు తెలుస్తోంది.

హ్యుందాయ్ ఇయాన్ డిజైన్ :

హ్యుందాయ్ ఇయాన్ డిజైన్ :

హ్యుందాయ్ ఇయాన్ డిజైన్‌ పరంగా ఏ మాత్రం రాజీపడదు. దీని ముందు వైపున ఉన్న హెడ్ ల్యాంప్ డిజైన్ ఎంతో బాగుంది. ఇది కాస్త స్పోర్టివ్‌గా ఉంటుంది. కారు యొక్క పక్కవైపుల గల డిజైన్ హ్యుందాయ్ యొక్క గొప్పతనాన్ని మరింత ఇముడింపచేసింది.

ఫీచర్స్ :

ఫీచర్స్ :

రెనొ క్విడ్:

రెనొ క్విడ్ లో దాదాపు పూర్తిగా డిజిటల్ పరికరాలను ఏర్పాటు చేశారు, ఇందులో 13-ఇంచుల చక్రాలు, అత్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ 180 ఎమ్ఎమ్ మరియు టాప్ ఎండ్ మోడల్ ఆర్.ఎక్స.ఇ వేరియంట్లో, 2-డిఐయన్ ఆడియో సిస్టమ్, ఏడు అంగుళాల తాకే తెర పరిమాణం, నావిగేషన్ సిస్టమ్ మరియు నాలుగువైపులకు అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీటు ఇందులో ఉన్న ప్రత్యేక్యతలు.

ఇయాన్ :

ఇయాన్ :

ఇందులో కూడా ఓ మోస్తరు ఫీచర్స్ ఉన్నాయి అవి త్రీ బ్యారెల్ డిజైన్ ఇంస్ట్రుమంట్ క్లస్టర్, పవర్ విండోస్, కీ లెస్ ఎంట్రీ మరియు దీని టాప్ లెవల్ వేరియంట్లో 2-డిఐన్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి. ఇంకా ఇందులో టిల్ట్ స్టీరింగ్, గేర్ షిప్ట్ ఇండికేటర్ మరియు డ్యూయల్ ట్రిప్ మీటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంజన్ స్పెసిఫికేషన్స్ :

ఇంజన్ స్పెసిఫికేషన్స్ :

రెనొ క్విడ్ :

రెనొ క్విడ్ శక్తివంతమైన మూడు సిలిండర్లు గల 800సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది మీకు 53 బిహెచ్‌పి ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

ఇయాన్ ఇంజన్ :

ఇయాన్ ఇంజన్ :

హ్యుందాయ్ ఇయాన్ 814సీసీ గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది ఇది మీకు 55 బిహెచ్‌పి పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది, మరియున ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు. ఇయాన్ మరొక ఇంజన్ 998సీసీ , 68 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల వేరింట్‌ని మరియు యల్.పి.జి వేరియంట్‌ను అందుబాటులో ఉంచింది.

మైలేజ్ :

మైలేజ్ :

ప్రస్తుత కాలంలో మైలేజ్‌కి కూడా ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారు.

రెనొ క్విడ్ లీటర్‌కు 25.17 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

ఇయాన్ 814సీసీ ఇంజన్ లీటర్‌కు 21.1 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

ఇయాన్ 998సీసీ ఇంజన్ లీటర్‌కు 20.3 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

భద్రత :

భద్రత :

రెనొ క్విడ్ :

ఎంట్రి లెవల్ హ్యాచ్ లలో భద్రతకు సంబదించన ఫీచర్లు పెద్దగా ఉండకపోవచ్చు. కాని క్విడ్‌ యొక్క ఆర్.ఎక్స్.టి వేరియంట్లో డ్రైవర్ పక్కన ఆప్షనల్ ఎయిర్ బ్యాగ్‌లను అందిస్తున్నారు. మరియు త్వరలో భద్రతకు సంబందిచిన పరీక్షలలో రెనొ క్విడ్ పాల్గొననున్నట్లు సమాచారం.

ఇయాన్ :

ఇయాన్ :

ఇయాన్‌లోని స్పోర్ట్ మోడల్‌లో డ్రైవర్ పక్కన ఎయిర్ బ్యాగ్‌లను అందిచారు. అయితే కారు ఎప్పుడయినా ప్రమాదానికి గురైతే కారు శరీరం ప్రమాద ప్రభావాలను తట్టుకోలేదు.

తీర్పు:

తీర్పు:

వీటికి తీర్పు ఇవ్వడం కాస్త కష్టమే ఎందుకంటే క్విడ్ మరియు ఇయాన్ రెండు పరవాలేదు. ఇజన్ పరంగా ఇయాన్ మంచిదే అయితే ధర కాస్త ఎక్కవే. దీని బట్టి చూస్తే క్విడ్ మీ బడ్జెట్‌కు మంచి కారు అని చెప్తాం. ఎందుకంటే మంచి మైలేజ్, అత్యధిక బూట్ స్పేస్ 300-లీటర్లు, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఇందులో ఉన్నాయి అయితే వీటన్నింటికి ఇయాన్ దూరంగా ఉంది. మేము మాత్రం రెనొ క్విడ్ కారును ఎంపిక చేస్తాము.

More from DriveSpark

Article Published On: Wednesday, October 14, 2015, 12:20 [IST]
English summary
Renault Kwid vs Hyundai Eon Comparo.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+