రెనో క్విడ్ విడుదల: ధర రూ 2.56 లక్షల నుండి మొదలు

By Anil

సరి క్రొత్త రెనో క్విడ్ భారత్‌లో లాంఛనంగా విడుదల చేశారు. దీని ధర 2.56 లక్షల నుండి మొదలవుతుంది. క్విడ్ చాలా తొందరగా విడుదల చేయాల్సిన మోడల్ . రెండు నెల క్రితమే విడుదల చేయాల్సి ఉంది దీని కోసం అనేక మంది వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. మరి కొంత మంది దీన్ని నమ్మలేకపోతున్నారు.

ప్రస్తుతం మొదటి దశలో హ్యాచ్ శ్రేణిలో అత్యధిక అమ్మకాలను దృష్టిలో పెట్టుకుంది. దీని యొక్క స్టైల్, బోల్డ్ స్టేన్స్ మరియు అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ క్విడ్ యొక్క ప్రత్యేక్యత.

రెనో క్విడ్

రెనో క్విడ్ ధరలు:
  • యస్.టి.డి- 2.57 లక్షలు
  • ఆర్.ఎక్స్.ఇ- 2.89 లక్షలు
  • ఆర్.ఎక్స్.ఇ(ఒ) -2.95 లక్షలు
  • ఆర్.ఎక్స్.ఎల్ - 3.21 లక్షలు
  • ఆర్.ఎక్స్.టి (ఒ)- 3.53 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూం ఢిల్లీ గా నిర్ణయించబడినవి)

ఇంజిన్ మరియు స్పెసిఫికేషన్స్:

రెనో క్విడ్ యొక్క ఇంజిన్ కెపాసిటి 799 సీసీ, మూడు సిలిండర్ల ఇంజిన్, లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ మరియు ఇది 53 బి.హెచ్.పి ని ఉత్పత్తి చేస్తుంది మరియు 72 ఎన్.ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

రెనో క్విడ్

మైలేజ్ :
రెనో శ్రేణిలో క్విడ్ 25 కిలో మీటర్/లీటర్ అత్యుత్తమ మైలేజ్ ఇవ్వగలదు.

ఫీచర్స్:

  • 2-డి.ఐ.ఎన్ ఆడియో సిస్టమ్ బ్లూటూత్ తో
  • పవర్ విండోస్
  • మీడియా-న్యావిగేషన్
  • ఏడు అంగుళాల తాకే తెర
  • ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంటేషన్ క్లస్టర్
  • 13-ఇంచెస్ వీల్స్
  • 180 ఎమ్.ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్
  • 300-లీటర్ బూట్ స్పేస్, ఎక్సపాండబల్ టు 1115-లీటర్స్

రెనో క్విడ్
భధ్రత:
  • ఎయిర్ బ్యాగ్ (ఆప్షనల్)
  • సెంటర్ లాకింగ్
  • ఆడిబుల్ పార్కింగ్ బ్రేక్ వార్నింగ్

రెనో క్విడ్ తప్పకుండా మారుతి సుజుకి ఆల్టో 800, కి గట్టి పోటి ఇవ్వగలదు ఎందుకంటే ప్రస్తుతం భారతదేశ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఇదే కాబట్టి.

Article Published On: Thursday, September 24, 2015, 18:36 [IST]
English summary
The Renault Kwid has been launched in India for a starting price of INR 2.56 lakh.
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+