3 శాతం పెరిగిన రెనొ క్విడ్ ధర

By Anil

రెనొ క్విడ్ విడుదల అయిన అనతి కాలంలోనే విశేష ఆదరణ పొందింది. ఇప్పటికే ఎంతో మంది దీనిని బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ క్విడ్ కారు మరింత ప్రియం కానుంది. దేశ వ్యాప్తంగా ఇతర కార్ల సంస్థలు తమ కార్ల మీద ధరలను పెంచుతున్న నేపథ్యంలో రెనొ కూడా తమ క్విడ్ కారు మీద ధరను పెంచింది.
Also Read: భారతీయ మార్కెట్లో 2015లో బెస్ట్ సెల్లింగ్ కార్లు: ఇందులో మీ కారు ఉందా?

ప్రస్తుతం మార్కెట్లో క్విడ్ యొక్క ప్రారంభ వేరియంట్ ధర రూ. 2.56 లక్షలు, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 3.53 లక్షలు ఎక్స్-షో రూమ్ గా ఉంది. అయితే రెనొ వారి పెంచిన మూడు శాతం పరగణలోకి తీసుకుంటే క్విడ్ యొక్క ప్రారంభ వేరింట్ ధర రూ. 2.64 లక్షలు ఎక్స్-షోరూమ్ గా ఉండనుంది.
Also Read: మారుతి ఆల్టో 800 ని చంపేసిన రెనొ క్విడ్ ?: అసలు ఏమైంది....

ప్రస్తుతం క్విడ్ కారుని దేశ వ్యాప్తంగా దాదాపుగా 75,000 మంది బుక్ చేసుకున్నారు. ఆరు నెలల తరువాత బుక్ చేసుకున్న వారికి కార్లు అందజేయనున్నారు. అయితే ప్రస్తుతం నెలకు 5,000 కార్లను రెనొ ఉత్పత్తి చేస్తోంది.
Also Read: రెనో క్విడ్ వర్సెస్ మారుతి ఆల్టో 800: వీటిలో ఏది అతి ఉత్తమమైన కారు ?

రెనొ క్విడ్ కారులో 800సీసీ గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 53 బిహెచ్‌పి పవర్ మరియు 72 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎఆర్ఎఐ సర్టిఫికేట్ ప్రకారం ఇది లీటర్‌కు 25.17 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. మరియు ఇందులో ప్రస్తుతం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది.
Also Read: రెనొ క్విడ్ మరియు హ్యుందాయ్ ఇయాన్‌ల మధ్య పెరిగిన పోటి.

కొత్తగా పెంచిన ధరలు 2016 జనవరి నుండి అందుబాటులోకి రానున్నాయి. ఆలోపు కొన్న వారికి పెంచిన ధరలు ఏ విధంగాను వర్తించవు.

రెనొక్విడ్ పెంచిన ధర వివరాలు

More from DriveSpark

Article Published On: Thursday, December 17, 2015, 18:25 [IST]
English summary
Renault Kwid Price To Be Hiked By Almost Three Percent
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+