జనవరి 15 నుంచి బస్ అండ్ స్పెషల్ వెహికల్ షో ప్రారంభం

By Ravi

నాల్గవ ఎడిషన్ 'బస్ అండ్ స్పెషల్ వెహికల్ షో 2015' ఈనెల 15వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ఈ షోని నిర్వహించనుంది. గడచిన సంవత్సరం ఆటో ఎక్స్‌పో నిర్వహించిన గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్ వద్దనే ఈ బస్ అండ్ స్పెషల్ వెహికల్ షోని కూడా నిర్వహించనున్నారు.

కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ప్రజా వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర రోడ్డు రవాణా అండర్‌టేకింగ్ సంస్థలు ఈ కార్యక్రమాన్ని ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించనున్నారు. జనవరి 15, 2015వ తేదీ నుంచి జనవరి 17, 2015వ తేదీ వరకూ, మొత్తం మూడు రోజుల పాటు బస్ అండ్ స్పెషల్ వెహికల్ షో జరగనుంది.

Bus And Special Vehicle Show

బస్సులు, వాణిజ్య వాహనాల్లో ఉపయోగించబోయే అధునాత సాంకేతికతలు, సరికొత్త కాన్సెప్ట్ వాహనాలను ఈ షోలో వీక్షించవచ్చు. అలాగే, ఈ షో వేదికగా కార్ మేకర్లు సిటీ బస్సులు, లగ్జరీ బస్సులు, స్కూల్ బస్సులు, ప్రత్యేకంగా డిజైన్ చేసిన బస్సులు, హైబ్రిడ్ బస్సులు, తేలిక/భారీ వాణిజ్య వాహనాలు, వ్యాన్‌లు, పికప్ ట్రక్కులు, ఎస్‌యూవీలు, ఎమ్‌యూవీలు, అంబులెన్సులు, అప్లికేషన్ వాహనాలను ప్రదర్శనకు ఉంచనున్నారు.

ఇంకా ఇవే కాకుండా.. టైర్లు, ట్యూబ్స్, బ్యాటరీలు, ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఆటో ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆటోమొబైల్ సేవల కంపెనీలు, విడిభాగాలు మరియు యాక్ససరీల కంపెనీలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేసి, కస్టమర్లకు సూచనలు ఇవ్వనున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 13, 2015, 17:02 [IST]
English summary
Society of Indian Automobile Manufacturers (SIAM) is organising the 4th Bus & Special Vehicle Show 2015 at India Expo Mart, Greater Noida, Delhi - NCR, India, from 15 - 17 January 2015 with support from Ministry of Heavy Industries and Public Enterprises, Government of India and Ministry of Road Transport & Highways, Government of India and Association of State Road Transport Undertakings (ASRTU).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+