స్కొడా ర్యాపిడ్ గో ఫర్ మోర్ ఆఫర్
స్కొడా ఇండియా అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ ర్యాపిడ్ కోసం కంపెనీ మరో కొత్త ఫైనాన్స్ స్కీమ్‌ను ప్రకటించింది. స్కొడా ర్యాపిడ్ గో ఫర్ మోర్ పేరిట కంపెనీ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా.. ర్యాపిడ్ సెడాన్ కొనుగోలుపై స్కొడా క్రింది ఆఫర్లను అందించనుంది:
- 4 ఏళ్ల పీరియాడిక్ మెయింటినెన్స్
- 4 ఏళ్ల (2+2) అదనపు వారంటీ
- 4 ఏళ్ల (2+2) రోడ్‌సైడ్ అసిస్టెన్స్
- 4 ఏళ్ల పాటు 7.99 శాతం వడ్డీ రేటు
ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమేనని, కాకపోతే ఇది డీజిల్ ఏటి వేరియంట్లకు వర్తించదని కంపెనీ ప్రకటించింది. ఈ ఫైనాన్స్ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత స్కొడా డీలరును సంప్రదించండి.

స్కొడా ర్యాపిడ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.6 లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 105 పిఎస్‌ల శక్తిని, 153 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 15 కిలోమీటర్ల మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ స్కొడా ర్యాపిడ్ లీటరుకు 14.3 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.
ఇకపోతే.. డీజిల్ వెర్షన్ స్కొడా ర్యాపిడ్‌లోని ఈ 1.5 లీటర్ టిడిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 103 హార్స్‌పవర్‌ల శక్తిని, 250 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్, 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మ్యాన్యువల్ వెర్షన్ మరియు ఆటోమేటిక్ వెర్షన్‌లు రెండూ ఒకే రకమైన మైలేజీని (లీటరుకు 21.14 కిలోమీటర్ల మైలేజీని) ఆఫర్ చేస్తాయి.


Click it and Unblock the Notifications








