2016 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు రానున్న శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్
మహీద్రా వారి ఆధ్వర్యంలో ఉన్న శాంగ్‌వాహన సంస్థ భారతీయ మార్కెట్లోకి సరికొత్త టివోలి కాంపాక్ట్ యస్‌యువిని ప్రవేశపెట్టనుంది. అందులో భాగంగా ఈ టివోలి కారును మహీంద్రా వారి సహకారంతో 2016 ఢిల్లీలో జరిగే ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేసింది.
ఆశ్చర్యకరమైన మోటార్‌సైకిల్ స్టంట్స్
శాంగ్‌యాంగ్ వారి రెండవ ఉత్పత్తిగా భారతీయ మార్కెట్లోకి విడుదల చేస్తున్న ఈ టివోలి కాంపాక్ట్ యస్‌యువి గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మహీంద్రా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న శాంగ్‌యాగ్ వాహన సంస్థ విడుదల చేయనున్న ఈ టివోలి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్కార్పియో మరియు ఎక్స్‌యువి5OO కార్ల కన్నా ఎక్కువ స్థానంలో ఇది ఉండనుంది.

మహీంద్రా ఇంజనీర్లు ఈ టివోలి కాంపాక్ట్ యస్‌యువి కారులో 1.6-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌ను అందివ్వడానికి ప్రయత్నిస్తున్నారు.

అంతర్జాతీయంగా శాంగ్‌యాంగ్ వారు ప్రస్తుతం ఈ టివోలిలో 2-వీల్ మరియు 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచారు.

ఈ డీజల్ మరియు పెట్రోల్ రెండు ఇంజన్లు కూడా యూరో-6 నార్మ్ ను పొందాయి. అనగా దాదాపుగా తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి.

ఇది మార్కెట్లోకి విడుదల అయిన తరువాత క్రింది మోడల్లతో పోటి పడాల్సి వస్తుంది. రెనో డస్టర్, టాటా హెక్సా. హ్యుందాయ్ క్రెటా మరియు మారుతి సుజుకి వారి త్వరలో విడుదల కానున్న వితారా ప్రీమియమ్ కాంపాక్ట్ యస్‌యువి.

ధర
శాంగ్‌యాంగ్ వారి ఈ టివోలి ధర ను ఇంకా వెల్లడించలేదు. శాంగ్‌యాంగ్ వారి ఉత్పత్తుల ధరలను అంచనా వేయడం కూడా కుదరదు. దీనిని విడుదల చేసేవరకు దీని ధర గురించి ఏ మాతం తెలుసుకోలేం.

సికెడి
శాంగ్‌యాంగ్ వారు మహీంద్రా వారి భాగస్వామ్యంతో భారతీయ మార్కెట్లోకి విడుదల చేస్తున్న ఈ టివోలి కాంపాక్ట్ యస్‌యువి ని కంప్లీట్లి నాక్డ్ డౌన్ ఆప్షన్‌తో నిర్మిస్తున్నట్లు తెలిపారు.

2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో
దీనిని డిల్లీలో జరిగే 2016 ఇండియన్ అటో ఎక్స్ పో లో ప్రదర్శించనున్నారు. ఆ ప్రదర్శనలో జరిగే అన్ని వివరాలు డ్రైవ్‌స్పార్క్ మీకు అందిస్తుంది. ప్రతి రోజు న్యూస్ లెటర్ కోసం మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి.

- ఆనంద్ మహీంద్ర గురించి ఆసక్తికరమైన విషయాలు
- మా బలం, మాకు గర్వకారణం..... ఇండియాలో తయారైన మిలిటరీ వాహనాలు!
- రిలయన్స్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ కారు హోమ్!


Click it and Unblock the Notifications








