టాటా నుండి మరొక కొత్త కారు 'కైట్' : ఇంజన్ మరియు స్పెసిఫికేషన్స్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టాటా ఇప్పడు తమ కార్ల విభాగం నుండి మరొక కొత్త కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా వారి కైట్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ యొక్క టీజర్‌ను ఇది వరకే విడుదల చేశారు.
అయితే టాటా కంపెనీ కార్ల వ్యాపారంలో మరింత పట్టును పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే విడుదలైన టాటా జెస్ట్ మంచి ఆదరణను పొందుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కైట్ యొక్క పూర్తి డిజైన్‌ను తయారుచేస్తున్నారు.
Also Read: మీ నగరంలో టాటా కార్ల ధరలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మరింత సమాచారం.....క్రింది ఫోటో ఫీచర్‌లో...

కైట్ ఎంతో సరసమై హ్యాచ్‌బ్యాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే టాటా వారి ఉత్పత్తులైన నానో కారుకు పై స్థానంలో మరియు బోల్ట్ కారుకు క్రింద స్థానంలో దీనిని అందిస్తున్నారు.

టాటా కైట్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఆల్టో, హ్యూందాయ్ ఇయాన్ మరియు రెనొ క్విడ్ లకు గట్టి పోటీగా రానుంది. ఎందుకంటే మంచి సరసమైన కార్లు మరియు అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్లు ఇవే కాబట్టి.

ఈ కారుకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న లియోనెల్ మెస్సీ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నట్లు టీజర్ ద్వారా తెలిసింది.

ఈ కైట్ కారు యొక్క ఇంజన్ వివరాలు టాటా మోటార్స్ ఇంకా వెల్లడించలేదు. కాని అభివృద్దిపరిచిన 1.0-లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ మరియు 1.2-లీటర్, మూడు సింలిండర్లు గల డీజల్ ఇంజన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ కైట్ మోడల్ కారును ఇండికా ఇవి2 ఆధారంతో రూపొందిస్తున్నారు. దీనిని ముఖ్యంగా జాతీయ మరియు అంర్జాతీయ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని వీటిని అందించాలని నిర్ణయించారు.

టాటా కైట్ యొక్క ఇంటీరియర్ డిజైన్‌ను, టాటా మోడల్స్ అయిన టాటా బోల్ట్ మరియు టాటా జెస్ట్ కార్ల ఇటీరియర్ డిజైన్ ప్రేరణతో దీనిని తయారు చేశారు.
- టాటా కైట్ గురించి ప్రక్కన గల వీడియోను చూడండి.


Click it and Unblock the Notifications








