వీడియో: టాటా బోల్ట్ సెకండ్ టివిసి లాంచ్
టాటా మోటార్స్ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త హ్యాచ్‌బ్యాక్ 'టాటా బోల్ట్' (Tata Bolt) ప్రచారం కోసం కంపెనీ ఇదివరకు గెట్ సెట్ బోల్ట్ అనే పేరుతో ఓ టెలివిజన్ కమర్షియల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు తాజాగా ఈ మోడల్ కోసం మరో ప్రకటనను టాటా మోటార్స్ రిలీజ్ చేసింది.
ఇది కూడా చదవండి: టాటా బోల్ట్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ
ఈ తాజా టాటా బోల్ట్ ప్రకటనలో కూడా కంపెనీ తమ కారులో ఆఫర్ చేస్తున్న వివిధ డ్రైవింగ్ మోడ్స్‌ని అలాగే కనెక్ట్‌నెక్స్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ని హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. మరి ఆ వీడియో కథా కమామిషీ ఏంటో మనం కూడా చూసేద్దాం రండి..!
టాటా బోల్ట్ కారు మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ (సిటీ, ఈకో, స్పోర్ట్)తో లభిస్తుంది. ఒక్కొక్క మోడ్‌లో డ్రైవింగ్ అనుభూతి ఒక్కో రకంగా అనిపిస్తుంది.
- ఈకో మోడ్: ఇంధనం ఆదా చేసేందుకు ఇంజన్ పెర్ఫార్మెన్స్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది.
- స్పోర్ట్ మోడ్: మరింత వేగంగా యాక్సిలరేట్ చేసేందుకు థ్రోటల్ (యాక్సిలరేటర్) రెస్పాన్స్‌ను పెంచుతుంది.
- సిటీ మోడ్: ఈకో మరియు స్పోర్ట్ మోడ్‌లను బ్యాలెన్స్ చేస్తుంది. (ఇది డిఫాల్ట్ మోడ్)
టాటా మోటార్స్ ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లతో, అత్యంత సరసమైన ధరకే (పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.4.44 లక్షలు, డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.5.49 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) తమ బోల్ట్ కారును విడుదల చేసింది. ఇది మొత్తం ఎనిమిది వేరియంట్లలో (నాలుగు పెట్రోల్, నాలుగు డీజిల్) లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








