సెకండ్ సీజన్ టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ డేట్స్ వెల్లడి చేసిన టాటా

ప్రముఖ దేశీయ వాణిజ్య వాహన దిగ్గజం టాటా మోటార్స్, గడచిన సంవత్సరం (2014)లో భారత్‌కు పరిచయం చేసిన టాటా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో తాజాగా రెండవ సీజన్‌ను వచ్చే మార్చ్ (2015) నెలలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

సెకండ్ సీజన్ 2015 టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను మార్చ్ 14, 15వ తేదీలలో గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద నిర్వహించనున్నారు. ఎఫ్ఐఏ మరియు ఎఫ్ఎమ్ఎస్‌సిఐల పర్యవేక్షణలో ఈ రేస్ నిర్వహిస్తారు.

కాగా.. ఈ రెండవ సీజన్ టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ కోసం కంపెనీ కొత్త ప్రైమా ట్రక్కులను ఆఫర్ చేస్తోంది (మొదటి సీజన్‌లో వాడిన ట్రక్కులు కాదు). ఈ కొత్త ట్రక్కులు తేలికగా, మంచి ఏరోడైనమిక్స్ కలిగి ఉండి వేగంగా పరుగులు తీస్తాయని కంపెనీ తెలిపింది.

టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

సెకండ్ సీజన్ టి1 ప్రైమా ట్రక్ రేస్

టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు రేసులు ఉంటాయి. అందులో ఒకటి 5 ల్యాప్ స్ప్రింట్ మరొకటి 15 ల్యాప్ మెయిన్ రేస్.

సెకండ్ సీజన్ టి1 ప్రైమా ట్రక్ రేస్

ఈ రెండు రేసులలో సంపాధించిన పాయింట్లను ఆధారంగా చేసుకొని తుది పాయింట్లను లెక్కించడం జరుగుతుంది. ఇలా వచ్చిన పాయింట్లలో అత్యధికంగా సాధించిన డ్రైవర్లను మరియు జట్లను అవార్డుతో సత్కరించడం జరుగుతుంది.

సెకండ్ సీజన్ టి1 ప్రైమా ట్రక్ రేస్

టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ కోసం టాటా మోటార్స్ ప్రత్యేకంగా 12 ప్రైమా బ్రాండ్ ట్రక్కులను తయారు చేసింది. వీటిని ప్రత్యేకించి రేస్‌కు అనువుగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ 12 ట్రక్కులను ఆరు జట్లకు కేటాయిస్తారు. ఒక్కొక్క జట్టులో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు.

సెకండ్ సీజన్ టి1 ప్రైమా ట్రక్ రేస్

సేఫ్టీ మరియు పెర్ఫామెన్స్ స్టాండర్డ్స్ విషయంలో బ్రిటీష్ ట్రక్ రేసింగ్ అసోసియేషన్ (బిటిఆర్ఏ) మార్గదర్శకాల ప్రకారం, ఎమ్ఎమ్ఎస్‌సిఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అంతర్జాతీయంగా నైపుణ్యం పొందిన డ్రైవర్లు ఈ పోటీలో పాల్గొననున్నారు.

సెకండ్ సీజన్ టి1 ప్రైమా ట్రక్ రేస్

ఈ రేస్ కోసం టాటా ప్రైమా 4038.ఎస్ ట్రక్కులను ఉపయోగించనున్నారు. ఇందులోని శక్తివంతమైన 8.9 లీటర్ ఇంజన్ గరిష్టంగా 370 బిహెచ్‌పిల శక్తిని, 1550 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

సెకండ్ సీజన్ టి1 ప్రైమా ట్రక్ రేస్

ఇదివరకటి రేస్‌లో ఈ ట్రక్కుల గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లుగా ఉండేది. కాగా.. ఈ సెకండ్ సీజన్ కోసం ఈ వేగాన్ని స్టాండర్డ్ రియర్ రియర్ యాక్సిల్ సాయంతో గంటకు 130 కిలోమీటర్లకు పెంచారు.

సెకండ్ సీజన్ టి1 ప్రైమా ట్రక్ రేస్

మొదటి సీజన్ మాదిరిగానే ఈ రెండవ సీజన్ టి1 ప్రైమా ట్రక్ రేస్‌లో కూడా ఒక్క ఇండియన్ డ్రైవర్ కూడా లేడు. కాగా.. 2016 సీజన్‌లోనైనా ఇండియన్ డ్రైవర్లు ఉండే విధంగా చూసుకునేందుకు, నిర్వాహకులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

సెకండ్ సీజన్ టి1 ప్రైమా ట్రక్ రేస్

ఈ ఏడాది రేసులో పాల్గొనబోతున్న జట్లు

* క్యాస్ట్రాల్ వెక్టన్

* కమ్మిన్స్

* టాటా టెక్నాలజీ మోటార్‌స్పోర్ట్స్

* డీలర్ వారియర్స్

* డీలర్ డేర్‌డెవిల్స్

* అల్లైడ్ పార్ట్‌నర్స్

Most Read Articles

English summary
India's largest manufacturer of automobiles and trucks, Tata motors had launched last year the inaugural Truck racing competition. Now they have announced that they will be laying the rubber with their trucks on Buddh International Circuit on 15th of March, 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X