టాటా నానో ప్లాంట్ కోసం గుజరాత్ నుంచి రూ.456 కోట్ల లోన్!

By Ravi

రతన్ టాటా కలల కారు టాటా నానోను ఉత్పత్తి చేయటం కోసం టాటా మోటార్స్ మొదట్లో పశ్చిమ బెంగాల్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, ఉత్పత్తికి అంతా సిద్ధం అనుకున్న తర్వాత ల్యాండ్ విషయంలో తలెత్తిన సమస్యల కారణంగా సదరు ప్లాంట్‌ను గుజరాత్‌కి తరలించిన సంగతి తెలిసినదే.

కాగా.. సనంద్‌లో టాటా నానో ప్లాంట్ కోసం గుజరాత్ రాష్ట్ర సర్కారు ఇప్పటి వరకూ రూ.456.79 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. గురువారం జరిగిన గుజరాత్ అసెంబ్లీలో సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శక్తిసిన్హ్ గోహిల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెనె పాటెల్ తెలిపారు.

Nano

కాగా.. 2012-13లో రూ.167.20 కోట్లు, 2013-14లో రూ.252.34 కోట్లు, 2014-15లో 37.25 కోట్లు (జనవరి 31, 2015) మంజూరు చేసినట్లు ఆమె వివరించారు. ఆసక్తికరమైన విషయం ఏటంటే.. ఈ రుణం మంజూరు చేసే నాటికే టాటా ప్లాంట్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయబడి, నిర్వహణలో ఉంది.

గుజరాత్ అధికారులు చెప్పిన దాని ప్రకారం ఈ మొత్తాన్ని ప్లాంటు ఏర్పాటు కోసం మంజూరు చేశారు. కానీ, అప్పటికే ప్లాంట్ ఏర్పడి, నిర్వహణలో ఉంది. పైపెచ్చు ఆ సమయంలో టాటా నానో కార్ల అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. మరి ఈ రుణ మొత్తాన్ని ఎందుకు ఖర్చు చేశారో అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

More from DriveSpark

Article Published On: Friday, March 20, 2015, 14:43 [IST]
English summary
The Nano was a revolutionary product in small car segment, they achieved competitive pricing. Indian made vehicle, however, did not receive the appreciation it deserved in the beginning. Gujarat Government has been with Tata Motors for their Nano project from day one. Over the last three year they have provided the manufacturer with loan amounts of INR 456 crore.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+