వరుసగా మూడో సారి అత్యంత విశ్వసనీయమైన హ్యాచ్‌బ్యాక్‌గా 'టాటా నానో'
ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన కారుగా రికార్డుకెక్కిన 'టాటా నానో', వరుసగా మూడోసారి కూడా భారతదేశంలో కెల్లా అత్యంత విశ్వసనీయమైన కారుగా నిలిచింది. 'బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్' ద్వారా వెల్లడించబడిన నివేదికలో టాటా నానో హ్యాచ్‌బ్యాక్ విభాగంలో భారతదేశంలో కెల్లా అత్యంత విశ్వసనీయమైన ఆటోమొబైల్ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది.
టాటా నానో తన విశ్వనీయతా సూచీని మరింత పెంచుకుని, వరుసగా మూడవ సంవత్సరం కూడా అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. కామ్నిసీంట్ గ్రూప్ కంపెనీ అయిన టిఆర్ఏ ఈ బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్, ఇండియా స్టడీ 2015ను ప్రచురించింది.

ప్రస్తుతం టాటా నానో కేవలం పవర్ స్టీరింగ్ వెర్షన్‌తో మాత్రమే (ట్విస్ట్) లభిస్తున్నట్లు సమాచారం. దేశీయ విపణిలో టాటా నానో ట్విస్ట్ ఎక్స్‌టి వేరియంట్ ధర రూ.2.43 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
టాటా నానో కారులో 624సీసీ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 37 బిహెచ్‌పిల శక్తిని, 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








