భారతీయ విపణిలోకి సరికొత్త టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌యువి కారు.
దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ తమ కార్ల విభాగం నుండి మరొక కారును భారతీయ మార్కెట్‌కు సమర్పించనుంది. టాటా మోటార్స్ తన కాంపాక్ట్ యస్‌యువి నెక్సాన్ కారును ఆస్ప్రే అను కోడ్ పేరుతో పరిచయం చేసింది. ఈ కోడ్ పేరును ఉత్తర అమెరికాలో గల కార్నివారస్ అనే పక్షి పేరు ప్రేరణతో నిర్ణయించినట్లు తెలిపారు.
Also Read: కొత్త తరం టయోటా ఇన్నోవా: ఫోటోలు మరియు స్పెసిఫికేషన్స్.
టాటా మోటార్స్ కంపెనీ ఈ నెక్సాన్ కాన్సెప్ట్ కారును 2014 లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్-పోలో ప్రదర్శించారు. అయితే టాటా మోటార్స్ ప్రస్తుతం పూర్తిగా తయారైన ఈ నెక్సాన్ కారును 2016 లో ఢిల్లీలో జరగబోయే ఆటో ఎక్స్-పోలో ప్రదర్శించనుంది.
టాటా వారి నెక్సాన్ కారు గురించి మరింత సమాచారం క్రింద స్లైడర్ ద్వారా తెలుసుకుందాం.

ఈ కారును టాటా వారి జెస్ట్ మరియు బోల్ట్‌ను సృష్టించిన వారే దీనిని కూడా తయారు చేశారు అని సమాచారం.

టాటా మోటార్స్ ఈ నెక్సాన్ కారును రెండు ఫ్యూయల్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానునన్నారు. అవి పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లు.

ఈ నెక్సాన్ కాంపాక్ట్ యస్‌యువి కారులో 1.2-లీటర్ ఇంజన్‌లను వినియోగించనున్నారు. టాటా బోల్ట్ మరియు జెస్ట్‌లలో కూడా ఈ తరహా ఇంజన్‌ను ఉపయోగించారు.

టాటా మోటార్స్ ఈ కొత్త నెక్సాన్ కారులో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఏయమ్‌టి) ను అందించేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

ఈ ఆస్ప్రే నెక్సాన్ కారు విడుదలైన తరువాత భారతీయ మార్కెట్లో ఇప్పటికే ఉన్న మహీంద్రా టియువి300 మరియు ఎకోస్పోర్ట్ వంటి కార్లకు పోటీగా నిలువనుంది.

టాటా వారి నెక్సాన్ కారు ధర దాదాపుగా రూ. 6.5 లక్షలు ఉంటుందని అంచనా.

నాలుగు మీటర్ల పొడవు ఉన్న ఈ టాటా నెక్సాన్ ఆస్ప్రే కాంపాక్ట్ యస్‌యువి కారు భారత దేశపు ఆటోమొబైల్ మార్కెట్లో మంచి ఆదరణ పొందగలదని కంపెని ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

అయితే ఈ నెక్సాన్ కారు మన దేశపు మార్కెట్లోకి 2016 సంవత్సరానికి చివర్లో లేదా 2017 ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.



Click it and Unblock the Notifications








