టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌‌యువి వచ్చేసిందోచ్....!!

By Anil

దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ ఒక్కక్కొటిగా భారతీయ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అది కూడా రకరకాల పేర్లు మరియు రకరకాల డిజైన్‌లతో తమదైన శైలిలో భారతీయ వాహన ప్రియులను ఆకట్టుకోవడానికి పథకం రచించింది. ఈ టాటా సంస్థ ఆస్ప్రే స్పైయిడ్ అనే కోడ్ పేరుతో ఈ కాంపాక్ట్ యస్‌యువిని ఆవిష్కరించింది.
మరింత చదవండి: మీ నగరంలో మీకు నచ్చిన టాటా కార్ల ధరలు తెలుసుకోండి.

టాటా వారి ఈ అప్‌కమింగ్ కాంపాక్ట్ యస్‌యువిని గతంలో 2014 లో జరిగిన ఆటో ఎక్స్‌-పోలో దీనిని ప్రదర్శించారు. ఈ ప్రాదజెక్ట్‌కు టాటా వారు ఎక్స్104 అనే కోడ్ పేరును నిర్ణయించారు. దీని గురించి మరింత సమాచారం క్రింది స్లైడ్స్ ద్వారా తెలుసుకుందాం...

 టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌‌యువి వచ్చేసిందోచ్....!!

టాటా మోటార్స్ వారు ప్రస్తుతం ప్రాజెక్ట్ గా తయారు చేస్తున్న అన్ని మోడల్లకు వివిధ రకాల పక్షుల పేర్లను కోడ్ పేరుగా పెడుతు వస్తున్నారు. అందులో కొన్ని ఫాల్కన్, పెలికాన్, కైట్, మరియు ఆస్ట్రే వంటి కోడ్ పేర్లన్ని కూడా పక్షులకు చెందినవే.

 టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌‌యువి వచ్చేసిందోచ్....!!

టాటా వారు దేశీయ మార్కెట్లోకి విడుదల చేస్తున్న నాలుగు మీటర్ల గల మొదటి యస్‌యువి ఇదే కావడం గమనార్హం. మరియు ఈ ప్రాజెక్ట్ పేరు ఎక్స్104 నెక్సాన్ అని తెలిపారు.

ఫోటోలు: AutoColumn

 టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌‌యువి వచ్చేసిందోచ్....!!

ప్రస్తుతం టాటా మోటార్స్ యొక్క్ తయారీ ప్లాంటులో ఈ నెక్సాన్‌కు చెందిన ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌కు చెందిన రకరకాల పరీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే దీని మన భారతీయ రోడ్ల మీదకు వదిలి పరీక్షించారు.

 టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌‌యువి వచ్చేసిందోచ్....!!

ఈ నాలుగు మీటర్ల ఆస్ప్రే మోడల్ కారు ఒక రకంగా రెనొ వారి డస్టర్ ను పోలి ఉంటుంది. అయితే మొత్తంగా ఇది కొంచెం పొడవుగా, ఎత్తుగా ఉంటుంది.

ఫోటోలు: AutoColumn

 టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌‌యువి వచ్చేసిందోచ్....!!

నెక్సాన్ కాన్సెప్ట్ కారు యొక్క డిజైన్‌కు మరియు ఈ ఆస్ప్రే డిజైన్‌కు చాలా వ్యత్యాసం ఉంది. గతంలో నెక్సాన్‌ ప్రజర్శించినపుడు డిజైన్‌కు కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఈ నెక్సాన్ ఆస్ప్రే కాంపాక్ట్ యస్‌యువిని రూపొందించారు.

 టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌‌యువి వచ్చేసిందోచ్....!!

మీరు టాటా మోటార్స్ వారి ఇతర కార్లను గమనించినట్లయితే ప్రతి కారులో కూడా చాలా ఎక్కువ క్యాబిన్ స్పేస్ ఉంటుంది. కాబట్టి ఇందులో ఎక్కువ క్యాబిన్ ‌స్పేస్‌ను కల్పించారు. ఇక వెనుక సీట్లో కూర్చునే వారు కాళ్లను సౌకర్యవంతంగా పెట్టుకోవడానికి ప్రత్యేకమైన రూపాన్ని ఇందులో అందించారు.

ఫోటోలు: AutoColumn

 టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌‌యువి వచ్చేసిందోచ్....!!

ఈ నెక్సాన్ కాంపాక్ట్ యస్‌యువి కారులో చాలా వరకు టాటా జికాకు చెందిన ఇంటీరియర్ ఫీచర్లు ఇందులో కల్పించారు. అందులో స్టీరింగ్ వీల్ డిజైన్, వెనుక డోర్లు, మరియు ఇందులో ఉన్న డ్యాష్ బోర్డ్ వంటి అంశాలు జికా కారు నుండి వచ్చాయన్నమాట.

 టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌‌యువి వచ్చేసిందోచ్....!!

ఇక దీనికి వెనకున్న డోరు గురించి తెలుసుకున్నారా? ఏకంగా ఇది టాటా జికా, ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్ వంటి మోడల్స్‌లో అచ్చం ఇలాంటి డిజైన్‌ను పోలి ఉంది.

ఫోటోలు: AutoColumn

 టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌‌యువి వచ్చేసిందోచ్....!!

ఇందులో దాదాపుగా జికా కారు యొక్క ఇంజన్‌లను వినియోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1.2-లీటర్ నాన్‌టర్బో వేరియంట్ పెట్రోల్ ఇంజన్ మరియు 1-లీటర్, మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్‌, ఈ డీజల్ ఇంజన్ టాటా వారి యొక్క పాత ఇంజన్ అయిన సిఆర్-4 అని తెలిసింది.

 టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌‌యువి వచ్చేసిందోచ్....!!

టాటా మోటార్స్ ఈ కాంపాక్ట్ యస్‌యువిలో దాదాపుగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ను అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కువ మంది వినియోగదారులు ఎయమ్‌టి వర్షెన్ గల కార్లను మాత్రమే ఎంచుకుంటున్నారు.

ఫోటోలు: AutoColumn

 టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌‌యువి వచ్చేసిందోచ్....!!

ఇక ఈ నెక్సాన్ కాంపాక్ట్ యస్‌యువి ధర విషయానికి వస్తే దాదాపుగా 7 లక్షల నుండి 10 లక్షల వరకు, దీని పెట్రోల్ బేస్ వేరింట్ నుండి డీజల్ యొక్క్ టాప్ వేరియంట్ వరకు ఈ ధర మధ్యలో ఉండనున్నాయి.

ఫోటోలు: AutoColumn

టాటా మోటార్స్

Article Published On: Monday, December 7, 2015, 15:59 [IST]
English summary
Tata Nexon SUV Spied Testing In Full Camouflage - Pictures
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+