లిమిటెడ్ ఎడిషన్‌గా ఐదు ఉత్పత్తులను విడుదల చేసిన టాటా

By Anil

పండుగ సీజన్ సంధర్భంగా వివిధ రకాల కంపెనీలు తమ ఉత్పత్తులకు ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్‌లను జోడించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి మరికొన్ని అయితే ఉన్న మోడళ్లకే మరిన్ని మెరుగులుదిద్ది విడుదల చేస్తున్నాయి అందులో దిగ్గజ దేశీయ వాహన రంగ సంస్థ టాటా ఒకటి.

టాటా కంపెని ఈ పండుగ సీజన్ సందర్భంగా ఇంతకు ముందే విడుదలైన టాటా సఫారి, జస్ట్, నానొ, బోల్ట్ మరియు ఇండిగొ మోడళ్లను సెలబ్రేషన్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేస్తోంది.

అంతే కాదు టాటా కంపెని క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. అక్టోబర్ 1 వ తేది నుండి నవంబర్ 15 వ తేది మధ్యలో ఎవరయితే టాటా ప్యాసింజర్ కార్లను కొనుగోలు చేస్తారో వారందరికి ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. దీని ద్వారా 20,000 నుండి 50,000 రుపాయల వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు, మరి కొంత మందికి 50 నుండి 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు: మారుతి బాలెనొ కారు వేరియంట్స్, సౌకర్యాలు మరియు ఇతర వివరాలు.

మరి ఈ ఐదు మోడళ్ల యొక్క ప్రత్యేకతలను క్రింది కథనాల ద్వారా తెసులుసుకుందాం....

టాటా జెన్‌‍ఎక్స్ నానొ సెలబ్రేషన్ ఎడిషన్ స్టాండర్డ్ :

టాటా జెన్‌‍ఎక్స్ నానొ సెలబ్రేషన్ ఎడిషన్ స్టాండర్డ్ :

నానొ యొక్క స్టాండర్డ్ వెర్షన్ నుండి స్పెషల్ గా డిజైన్ చేయబడిన లెథర్ సీట్ కవర్, బంపర్ కార్న్‌ ప్రొటెక్టర్, రిమోట్ కంట్రోల్ హ్యాచ్, సెలబ్రేషన్ ఎడిషన్ గ్రాఫిక్స్ మరియు సెలబ్రేషన్ ఎడిషన్ బ్యాడ్జ్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులోఉన్నాయి వీటన్నింటి విలువ 11,500. రుపాయలు. వీటిని మీకు 10,500 రుపాయలకే అందిస్తున్నారు.

టాటా జెన్‌‍ఎక్స్ నానొ సెలబ్రేషన్ ఎడిషన్ ప్రీమియమ్ :

టాటా జెన్‌‍ఎక్స్ నానొ సెలబ్రేషన్ ఎడిషన్ ప్రీమియమ్ :

ఇందులో సన్ రూఫ్, రిమోట్ కంట్రోల్ హ్యాచ్, స్పెషల్ గా డిజైన్ చేయబడిన లెథర్ సీట్ కవర్ బంపర్ కార్న్‌ ప్రొటెక్టర్, సెలబ్రేషన్ ఎడిషన్ గ్రాఫిక్స్ మరియు సెలబ్రేషన్ ఎడిషన్ బ్యాడ్జ్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులోఉన్నాయి వీటన్నింటి విలువ 27,000 రుపాయలు. వీటిని మీకు 24,999 రుపాయలకే అందిస్తున్నారు.

టాటా బోల్ట్ సెలబ్రేషన్ ఎడిషన్ :

టాటా బోల్ట్ సెలబ్రేషన్ ఎడిషన్ :

ఇందులో ఫీచర్లు బ్లాక్ టెక్శ్చర్ రూఫ్, బ్యానెట్, సి-పిల్లర్స్, స్కఫ్ పేట్, స్పోర్టివ్‌గా ఉన్న వెనుక స్పాయిలర్, సెలబ్రేషన్ ఎడిషన్ యొక్క బాడీ గ్రాఫిక్స్ మరియు సెలబ్రేషన్ ఎడిషన్ బ్యాడ్జి ఇందులోఉన్నాయి వీటన్నింటి విలువ రూ. 17,800 ఉండగా, వీటిని మీకు 12,900 రుపాయలకే అందిస్తున్నారు.

టాటా జస్ట్ యానివర్సరి ఎడిషన్ :

టాటా జస్ట్ యానివర్సరి ఎడిషన్ :

కొత్త రంగులలో ఇంటీరియర్, వీల్ కవర్స్, పియానో బ్లాక్ ఫినిషింగ్ గల సైడ్ మిర్రర్స్, వెనుకవైపున గల విండో కర్టెన్‌ని రిమోట్ కంట్రోల్‌తో జరపడం, యానివర్సరి ఎంబ్రాయిడరి డిజైన్ కలిగిన సీట్లు, ఇల్లుమినేటెడ్ స్కఫ్ ప్లేట్స్ మరియు యానివర్సరి ఎడిషన్ గ్రాఫిక్ డిజైన్ మరియు యానివర్సరి ఎడిషన్ బ్యాడ్జి ఇందులో ఉన్నాయి. వీటన్నింటిని కేవలం రూ. 15,000 లకే అందిస్తున్నారు.

సఫారి స్టార్మ్ సెలెబ్రేషన్ ఎడిషన్ :

సఫారి స్టార్మ్ సెలెబ్రేషన్ ఎడిషన్ :

ఇందులో పోర్టబుల్ నావిగేషన్ డివైస్, డై టైమ్ రన్నింగ్ లైట్స్, యుయస్‌బి పోర్ట్, హుడ్ డిఫ్లెక్టర్, హుడ్ స్కూప్, డోర్ విసర్ మరియు సెలబ్రేషన్ ఎడిషన్ బాడీ గ్రాఫిక్స్, సెలబ్రేషన్ ఎడిషన్ బ్యాడ్జి ఉన్నాయి. వీటన్నిటిని రూ. 34,999 లకు అందిస్తున్నారు.

టాటా ఇండిగొ సెలెబ్రేషన్ ఎడిషన్ స్టాండర్డ్ :

టాటా ఇండిగొ సెలెబ్రేషన్ ఎడిషన్ స్టాండర్డ్ :

సీట్ కవర్స్, స్టీరింగ్ వీల్ కవర్స్, మ్యాట్స్, డ్రైవర్ కిట్, మడ్ ఫ్లాప్, సెలబ్రేషన్ ఎడిషన్ బాడి గ్రాఫిక్స్ మరియు సెలబ్రేషన్ ఎడిషన్ బ్యాడ్జి ఇందులో కొత్త ఫీచర్లు వీటి విలువ 7,000 రుపాయలు.

టాటా ఇండిగొ సెలబ్రేషన్ ఎడిషన్ ప్రీమియమ్ :

టాటా ఇండిగొ సెలబ్రేషన్ ఎడిషన్ ప్రీమియమ్ :

ఇండిగొ ప్రీమియమ్‌లో ఆడియో సిస్టమ్, సీట్ కవర్, స్టీరింగ్ వీల్ కవర్, మ్యాట్లు, మడ్ ప్లాప్, డ్రైవర్ మ్యాట్, సెలబ్రేషన్ ఎడిషన్ బాడి గ్రాఫిక్స్ మరియు సెలబ్రేషన్ ఎడిషన్ బ్యాడ్జి వంటి ఫీచర్లు ఉన్నాయి వీటి విలువ 10,000 రుపాయలుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 13, 2015, 12:25 [IST]
English summary
Tata Safari, Zest, Bolt, Nano and Indigo Celebration Edition launched
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+