నేపాల్ మార్కెట్లో టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ విడుదల
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, గడచిన సంవత్సరం దేశీయ విపణిలో విడుదల చేసిన తమ తొలి కాంపాక్ట్ సెడాన్ 'టాటా జెస్ట్' (Tata Zest)ను కంపెనీ తాజాగా నేపాల్ మార్కెట్లో విడుదల చేసింది. నేపాల్ మార్కెట్లో టాటా జెస్ట్ ప్రారంభ ధర కేవలం రూ.24.5 లక్షలు (బేస్ పెట్రోల్ వేరియంట్ ధర, నేపాల్ ఎక్స్-షోరూమ్).
నేపాల్ మార్కెట్లో టాటా జెస్ట్ మొత్తం 7 వేరియంట్లలో (3 పెట్రోల్, 4 డీజిల్) లభ్యం కానుంది. అన్ని పెట్రోల్ వెర్షన్లు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభిస్తాయి. కాగా.. డీజిల్‌లో వెర్షన్‌లో టాప్-ఎండ్ వేరియంట్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)తో లభిస్తుంది.
టాటా జెస్ట్ పెట్రోల్ ఇంజన్:
పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో కంపెనీ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇందులో కంప్లీట్ ఆటోమేటిక్ కానీ లేదా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) కానీ అందుబాటులో లేదు.

టాటా జెస్ట్ డీజిల్ ఇంజన్:
డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. డీజిల్ వెర్షన్ టాప్-ఎండ్ వేరియంట్ మాత్రం ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)తో లభిస్తుంది. ఈ ఏఎమ్‌టి ఇటలీకి చెందిన మాగ్నెటి మారెల్లీ సంస్థ సహకారంతో తయారు చేశారు.
మైలేజ్:
ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) సర్టిఫై చేసిన దాని ప్రకారం, పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్ లీటరుకు 17.6 కిలోమీటర్ల మైలేజీని, డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ లీటరుకు 23.0 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.
ఫీచర్లు:
ప్రీమియం కార్లలో లభించే పాపులర్ హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను టాటా మోటార్స్ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో పరిచయం చేసింది. ఇందులోని 5 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అడ్వాన్స్డ్ వాయిస్ కమాండ్ రికగ్నైజేషన్, ఎస్ఎమ్ఎస్ నోటిఫికేషన్ అండ్ రీడ్ అవుట్స్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్స్ వంటి ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








