టెస్లా రోడ్‌స్టర్ 3.0 రోడ్‌ట్రిప్: సింగిల్ చార్జ్‌పై 580 కిలోమీటర్లు

By Ravi

కాలిఫోర్నియాకి చెందిన టెస్లా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ తొలిసారిగా 2008లో విడుదల చేసిన టెస్లా రోడ్‌స్టర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ కారును, రోడ్‌స్టర్ 3.0 పేరుతో బ్యాటరీ రేంజ్‌ను మరింత పెంచేలో అభివృద్ధి చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనంలో తెలుసుకున్నాం. కాగా.. తాజాగా ఈ కంపెనీ తమ టెస్లా రోడ్‌స్టర్ 3.0 మోడల్ కోసం రోడ్ ట్రిప్ నిర్వహించింది.

ఈ రోడ్‌ట్రిప్‌లో టెస్లా రోడ్‌స్టర్ 3.0 సింగిల్ చార్జ్‌పై 340 మైళ్ల దూరం ప్రయాణించింది. ఇంకా 20 మైళ్ల ప్రయాణానికి సరిపడా బ్యాటరీ పవర్ నిల్వ ఉన్నట్లు కంపెనీ ధృవీకరించింది. లాస్ ఏంజిల్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వరకూ ఆగకుండా దూసుకుపోయేలా చేసే టెస్లా రోడ్‌స్టర్ 3.0 ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేశారు.

వాస్తవానికి టెస్లా రోడ్‌స్టర్ 3.0 మొత్తం 400 మొళ్ల రేంజ్ (643 కి.మీ)ను ఆఫర్ చేయాల్సి ఉంది. అయితే, ఇది తొలి టెస్టులో కేవలం 340 మైళ్ల రేంజ్‌ని మాత్రమే ఇచ్చింది. ఈ నేపథ్యంలో, బ్యాటరీ రేంజ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం ఇందులో ఏవైనా స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది.

Tesla Roadster 3

కొత్త టెస్లా రోడ్‌స్టర్ 3.0 ప్రోటోటైప్ మెరుగైన బ్యాటరీ లైఫ్, కొత్త ఏరోడైనమిక్ కిట్ మరియు వీల్ అప్‌గ్రేడ్‌తో రూపుదిద్దుకుంటుందని, ఒరిజినల్ రోడ్‌స్టర్‌తో పోల్చుకుంటే దీని రేంజ్ 40-50 శాతం పెరుగుతుందని టెస్లా పేర్కొంది. కొత్త 70 కిలోవాట్ అవుట్‌పుట్ బ్యాటరీ వలన రేంజ్ 31 శాతం పెరుగుతుంది.

అలాగే, కొత్త రెట్రోఫిట్ ఏరో కిట్ వలన డ్రాగ్ 15 తగ్గుతుంది మరియు కొత్త టైర్లు, అప్‌గ్రేడెడ్ బేరింగ్స్ వలన రోలింగ్ సామర్థ్యం 20 శాతం మెరుగు పడుతుందని కంపెనీ వివరించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టెస్లా రోడ్‌స్టర్ లిథియం అయాన్ బ్యాటరీలతో నడుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు పూర్తి చార్జ్‌పై 200 మైళ్ల (320 కిలోమీటర్ల) దూరం వెళ్తుంది. ఇది కేవలం 3.7 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 18, 2015, 17:45 [IST]
English summary
Tesla Motor's Roadster 3.0 managed to reach 340 miles on single charge on the San Jose to Los Angeles route. Earlier Tesla has announced its new Roadster 3.0 prototype which will improve the car in three ways: improved battery life; a new aerodynamic kit; and a wheel upgrade.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+