మీ ఫేవరేట్ షెవర్లేని టెస్ట్ డ్రైవ్ చేయండి, స్విట్జర్లాండ్‌కు వెళ్లండి!
జనరల్ మోటార్స్ ఇండియా తమ షెవర్లే వినియోగదారుల కోసం ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. కస్టమర్లు ఈనెలాఖరు లోపుగా ఏ షెవర్లే కారునైనా టెస్ట్ డ్రైవ్ చేసినట్లయితే, స్విట్జర్లాండ్ రౌండప్ ట్రిప్‌ను గెలుచుకునే అవకాశాన్ని పొందవచ్చు.
షెవర్లే డ్రైవ్ అండ్ ఫ్లై కార్నివాల్ క్యాంపైన్‌లో భాగంగా, కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ క్యాంపైన్‌లో భాగంగా ఏ షెవర్లే కారును టెస్ట్ డ్రైవ్ చేస్తే, కస్టమర్లు ఓ లక్కీ డ్రా కూపన్‌ను పొందుతారు. ఈ లక్కీ డ్రాలో గెలిచిన కస్టమర్లు జంటగా స్విట్జర్లాండ్‌ను ఎంజా చేసి రావచ్చు.
ఫ్లయిట్ టికెట్, ఫుడ్ అండ్ అకామిడేషన్‌కు అయ్యే ఖర్చులను కంపెనీ భరిస్తుంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, నియమ నిబంధనల కోసం ఈ ఫొటోపై క్లిక్ చేయండి.

ఇదే కాకుండా కంపెనీ అందిస్తున్న అన్ని రకాల కార్లపై ఆకర్షనీయమైన వడ్డీ రేట్లు, ఈఎమ్ఐ స్కీమ్‌లను కూడా అందిస్తోంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, వివిధ మోడళ్ల ప్రారంభ ఈఎమ్ఐ వివరాలు ఇలా ఉన్నాయి:
- షెవర్లే స్పార్క్ హ్యాచ్‌బ్యాక్ ఈఎమ్ఐ - రూ.4,999
- షెవర్లే బీట్ హ్యాచ్‌బ్యాక్ ఈఎమ్ఐ - రూ.6,199
- షెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్ ఈఎమ్ఐ - రూ.7,199
- షెవర్లే సెయిల్ సెడాన్ ఈఎమ్ఐ - రూ.8,299
- షెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి ఈఎమ్ఐ - రూ.9,599
- షెవర్లే క్రూజ్ సెడాన్ ఈఎమ్ఐ - రూ.22,999
(పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత షెవర్లే డీలరును సంప్రదించండి)


Click it and Unblock the Notifications








