భారతీయ మార్కెట్లో అమ్మకాలను విరమించుకున్న టాప్-10 మోడల్స్

By Anil

ప్రస్తుతం కాలంలో కార్లను రీకాల్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఎంతటి గొప్ప మోడల్ కార్లను అయినా అందులో ఏవైనా తప్పులు ఉన్నాయంటే వాటిని మార్కెట్లోకి రానీయకుండా వాటి అమ్మకాలను విరమించుకుంటున్నారు. తరువాత వాటి వెనకున్న తప్పులను సరిచేసి మార్కెట్లోకి విడుదల చేస్తారు. కొన్ని లక్షల కార్లను అమ్మడం కన్నా ఉత్తమంగా ఎటువంటి సమస్యలు లేకుండా అందిచాలని చాలా కంపెనీలు నమ్ముతాయి.
Also Read: దుబాయ్‌ని షేక్ చేసే 'షేక్' ట్రక్

కాని మళ్లీ ఏంజరుగుతుంది కారు కొనాలనుకునే వారు ఒకటికి రెండు సార్లు అలా రీకాల్ చేసిన కార్ల గురించి ఆలోచిస్తారు. ప్రత్యేకంగా ఏ కారణంగా కార్లను రీకాల్ చేసారు అని ఆలోచిస్తారు. కొన్ని కార్లను రీకాల్ చేయడానికి వివిధ రకాల కారణాలు ఉంటాయి అందులో ఉదాహరణకి ఎయిర్ బ్యాగ్‌లలో లోపం ఉండటం వంటి కారణాలు ఉంటాయి.
Also Read:ర్ల్‌ఫ్రెండ్స్ కన్నా కార్లను మెయింటైన్ చేయటమే ఈజీ!

అయితే భారతీయ మార్కెట్లో అత్యంత ఆదరణ కలిగిన మరియు ఎక్కువ అమ్ముడుపోయే పది ఉత్తమమైన మోడల్స్‌ను కూడా కొన్ని సార్లు మార్కెట్లో నుండి అమ్మకాలను విరమించుకున్నారు(రీకాల్). అయితే 2012 నుండి ఇప్పటి వరకు రీకాల్ అయిన టాప్-10 కార్ల గురంచి మరియు వాటి కారణాలను తెలుసుకుందాం రండి.

10. నిస్సాన్ సన్ని

10. నిస్సాన్ సన్ని

నిస్సాన్ 2013లో 15,902 సన్ని మోడల్ కార్లను, బ్రేక్‌లో ఉండే మాస్టర్ సిలిండర్ సీల్‌ను సరిగ్గా అమర్చని కారణంగా రీకాల్ చేశారు. ఆ తరువాత 2015 లో ఎయిర్ బ్యాగ్‌ల అమరికలో లోపం మరియు ఇంజన్ స్విచ్‌ల లోపం కారణంగా తిరిగి 5,500 సన్ని మోడల్ కార్లను రీకాల్ చేసింది. అంటే 21,402 నిస్సాన్ సన్ని కార్లు రీకాల్ అయ్యాయి. సన్ని కారును కొనె ముందు పైన వెల్లడించిన విశయాలలో లోపం ఉందేమో చూసుకోండి.

09. మహీంద్రా స్కార్పియో

09. మహీంద్రా స్కార్పియో

మీరు చదివింది నిజమే ఇది నిజంగా మహీంద్రా స్కార్పియోనే. 2013 లో ప్రెసర్ రెగ్యులేటింగ్ వాల్వ్ సమస్య వలన మహీంద్రా స్కార్పియోలోని 985 ఇయక్స్ వేరింట్‌ యస్‌‌యువిలను రీకాల్ చేశారు. తరువాత 2014 లో ఇదే మోడల్ ఇదే సమస్య మీద దాదాపుగా 23,519 యూనిట్ల కార్లు రీకాల్ అయ్యాయి. మొత్తం మీద 24,504 స్కార్పియో యస్‍‌యువి కార్లు రీకాల్ అయ్యాయి.

08. ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్

08. ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్

2012, ఆ మద్య కాలంలో ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ మరియు ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లు వివిద కారణాలతో మొత్తం 1,28,655 యూనిట్లు రీకాస్ అయ్యాయి. 2013 లో ఫోర్డ్ దాదాపుగా 25,871 ఫియస్టా క్లాసిక్ కార్లను రీకాల్ చేసింది. అయితే దీనికి కారణం ఇందులో కొన్ని భాగాలు సరిగా ఫిట్ చేయకపోవడం వలన అని తెలిసింది.

 07. ఫోర్డ్ ఎకోస్పోర్ట్

07. ఫోర్డ్ ఎకోస్పోర్ట్

ఫోర్డ్ నుండి రెండవ మోడల్ ఫోర్డ్ఎకోస్పోర్ట్ ఎక్కువగా రీకాల్ అయ్యాయి. 2013 లో గ్లో ప్లగ్ రిలోకేషన్ కారణంగా 972 యూనిట్లు, 2014 లో ఫ్యూయల్ లైన్ మరియు ఎయిర్ బ్యాగ్‌లను సరిగా అమర్చకపోవడం వలన దాదాపుగా 20,700 యూనిట్లు మరియు 2015 నవంబర్‌లో వెనుకవైపున సస్పెన్షన్ సరిగా లేకపోవడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయనే కారణంగా 16,500 యూనిట్ల ఎకోస్పోర్ట్ వాహనాలను ఫోర్డ్ రీకాల్ చేసింది. అంటే మొత్తం మీద 38,224 కార్లు రికాల్ అయ్యాయి.

06.టయోటా ఇన్నోవా

06.టయోటా ఇన్నోవా

భారతీయ మార్కెట్లో అత్యదికంగా అమ్మకాలు సాగిస్తున్న టయోటా కూడా కొన్ని వాహనాలను రీకాల్ చేసింది. 2014లో టయోటా ఇన్నోవాలో స్టీరింగ్ వీల్‌ను సరిగాస బిగించకపోవడం వలన టయోటా దాదాపుగా 44,989 యూనిట్ల ఇన్నోవా కార్లను రీకాల్ చేసింది.

05. మారుతి సుజుకి స్విప్ట్ డిజైర్

05. మారుతి సుజుకి స్విప్ట్ డిజైర్

ఎక్కువ కార్లను అమ్ముతున్న మారుతి సుజుకి కూడా ఈ సమస్య తప్ప లేదు. 2014లో డిజైర్ కాంపాక్ట్ సెడాన్ లో స్టీరింగ్ వీల్ రాడ్ సమస్య కారణంగా 581 కార్లు, 2014 లో మళ్లీ ఫ్యూయల్ నింపే నెక్ దగ్గర సమస్య కారణంగా దాదాపుగా 42,481 కార్లు, మరో సారి ఎదో సమస్య కారణంగా 12, 486 కార్లను 2014లో రీకాల్ చేశారు. మొత్తం మీద 55,548 స్విఫ్ట్ డిజైర్ కార్లను రీకాల్ చేసింది.

04. మహీంద్రా యక్స్‌యువి5OO

04. మహీంద్రా యక్స్‌యువి5OO

2013 నుండి మొత్తం 84,695 యూనిట్ల యక్స్‌యువి5OO కార్లను మహీంద్రా రీకాల్ చేసింది.2013 లో మొదటి సారిగా 24,695 ఆయిల్ క్యాప్ సీపేజ్ సమస్య వలన, 2015 లో వీటిలో ఎయిర్ బ్యాగులకు చెందిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసే విషయంలో దాదాపుగా 60,000 యూనిట్లను రీకాల్ చేసింది.

 03. షెవర్లే తవేరా

03. షెవర్లే తవేరా

దాదాపుగా 1,14,000 తవేరా వాహనాలను రీకాల్ చేసి షెవర్లే మూడవ స్థానంలో ఉంది. ఇందులో ఉద్గారాలకు సంభందించిన పరికరాల అమరిక కారణంగా 2013లో దాదాపుగా 1,14,000 తవేరా కార్లు రీకాల్ అయ్యాయి.

02. ఫోర్డ్ ఫిగో

02. ఫోర్డ్ ఫిగో

మొదటి సారిగా 2012లో ఫోర్డ్ ఫిగోలో రియర్ ట్విస్ట్ బీమ్ తప్పుగా అమర్చడం వలన దాదాపుగా 1,09,469 కార్లను రీకాల్ చేశారు. తరువాత 2013 లో పవర్ స్టీరింగ్ హోస్‌లో లీక్ కారణంగా 30,681 ఫిగో కార్లను ఫోర్డ్ రీకాల్ చేసింది. అంటే మొత్తం 1,40,000 ఫిగో కార్లు రీకాల్ చేయబడ్డాయి.

01. హోండా సిటి

01. హోండా సిటి

జపాన్‌కు చెందిన హోండా అత్యధికంగాఅమ్ముతున్న కారు హోండా సిటి మరియు భారతీయ మార్కెట్లో అత్యధికంగా రీకాల్ చేయబడిన కారు కూడా ఇదే. మొదటి సారిగా డ్రైవర్ ప్రక్కన గల పవర్ విండో స్విచ్ పనిచేయకపోవడం వలన 42,672 యూనిట్లు మరియు 2015 లో ఎయిర్ బ్యాగ్‌ సమస్య వలన దాదాపుగా 1,43,154 యూనిట్ల హోండా సిటి కార్లు రీకాల్ అయ్యాయి.

మరిన్ని ఆశక్తికరమైన విషయాల కోసం
  1. యమహా ఆర్ఎక్స్135 బైక్‌పై విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్
  2. ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రమాదకరమైన రహదారి!
  3. ట్రైన్ రేస్ ఎక్కడైనా చూశారా?

Article Published On: Saturday, November 28, 2015, 20:03 [IST]
English summary
Top 10 Most Recalled Vehicles In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+