2016 టయోటా ఇన్నోవా: సంగతులేంటో చూద్దామా ?
జపాన్‌కు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ అయిన టయోటా తన కొత్త ఇన్నోవాను 2016 డిల్లీ ఆటో ఎక్స్-పోలో ప్రవేశపెట్టనుంది. అయితే దీని ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ కు చెందిన ఫోటోలను ఆటోనెట్ మ్యాగజైన్ విడుదల చేసింది.
మీ నగరంలో మీకు నచ్చిన టయోటా కార్ల ధరలు తెలుసుకోండి...
ఈ కొత్త తరం 2016 టయోటా ఇన్నోవా గురించి మరింత సమాచారం క్రంది స్లైడర్‌ల ద్వారా తెలుసుకుందాం రండి...

ఇంటీరియర్
ఇందులో సరికొత్త టచ్‌స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ కలదు, మల్టీ-ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే కొరికు కలర్ డిస్ల్పే మరియు పానీయాలను స్టోర్ చేసుకునేందుకు చిల్డ్ గ్లోవ్ బాక్స్ ఇందులో ఉన్నాయి. ఒక రకంగా చూస్తే ఇది దాదాపుగా టయోటా ఫార్ఛ్యూనర్ లో ఉన్న సౌకర్యాలు ఇందులో చాలా వరకు పొందుపరిచినట్లు కనిపిస్తోంది.

ఎక్స్‌టీరియర్
కొత్త టయోటా ఇన్నోవా యొక్క ఎక్స్‌టీరియర్‌లో ఉన్న విశేషాలు ఎంటో చూద్దాం రండి.
ఇందులో యల్.ఇ.డి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్,ఇంటిగ్రేటెడ్ యల్.ఇ.డి లైట్లు కలిగిన వెనుకవైపు స్పాయిలర్ మరియు న్యూ ఫ్రంట్ గ్రిల్ ఇందులో ఉన్న అధునాతన ఎక్స్‌టీరియర్ ఫీచర్లు.

ఇండోనేషియాలో
టయోటా మోటార్స్ ఈ కొత్త టయోటా ఇన్నోవాను ప్రస్తుతం ఇడోనేషియాలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తోంది.

ఇంజన్
ఇండోనేషియాలో ప్రారంభానికి నోచుకుంటున్న టయోటా ఇన్నావా 2-లీటర్ పెట్రోల్ మరియు 2.4-లీటర్ డీజల్ ఇంజన్‌తో అందుబాటులో ఉండనుంది. అయితే ఈ రెండు ఇంజన్‌లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులోకి రానున్నాయి.

అందుబాటులో ఉన్న వేరియంట్స్
టయోటా మోటార్స్ తన కొత్త ఇన్నోవాను ఇండోనేషియాలో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. అయితే టయోటా ఇన్నావాను మూడు వేరియంట్లలో అందివ్వనున్నారు. అవి
- ఇన్నోవా జి
- ఇన్నోవా వి
- ఇన్నోవా క్యూ

భారత్ మార్కెట్లోకి
టయోటా మోటార్స్ ఈ ఇన్నోవాను 2016 డిల్లీలో జరగనున్న ఆటో ఎక్స్-పోలో ప్రదర్శించనున్నారు. అయితే దీనిని 2016 సంవత్సరం మద్య భాగానికి దీనిని విడుదల చేయనున్నట్లు సమాచారం.

ధర
యోటా ఇన్నోవా 2016 మోడల్ యొక్క ధర అక్షరాల రూ. 12 లక్షలు గా ఉండనుంది. ఈ టయోటా ఇన్నోవా గురించి మరింత కొత్త సమాచారం కోసం డ్రైవ్‌స్పార్క్ తో కలిసి ఉండండి.
టయోటా ఇన్నోవా వీడియో
కొత్త తరం యొక్క టయోటా ఇన్నోవా గురించి ప్రక్కనున్న వీడియో ద్వారా తెలుసుకోండి.

మరిన్ని టయోటా కార్ల గురించి తెలుసుకోండి..


Click it and Unblock the Notifications