కొత్తతరం టయోటా ఇన్నోవా: ఫోటోలు మరియు స్పెసిఫికేషన్స్.

By Anil

ఇప్పటి వరకు ఉన్న టయోటా ఇన్నోవా కార్లను చూసి చూసి విసుగు వస్తోందా. ఒక్క సంవత్సరం ఆగండి సరి కొత్త టయాటా ఇన్నోవా మన భారత మార్కెట్లోకి వచ్చేస్తోంది. 2016 సంవత్సరానికి టయోటా తమ కొత్త తరం ఇన్నోవాను విడుదల చేయనుంది.
Also Read: మీ నగరంలో టయోటా కార్ల ధరల గురించి తెలుసుకోండి.

టయోటా మోటార్స్ ఇండోనేషియాలో విడుదల చేయనుంది. మన దేశంలో దీనిని వచ్చే ఏడాది మధ్య భాగంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 2016 డిల్లీ లో జరగనున్న ఆటో ఎక్స్‌-పో లో దీనిని ప్రదర్శించనున్నారు. మరి ఈ కొత్త టయోటాను మీకు కూడా కొనాలని ఉందా? కొనే ముందు ఒక సారి దీని గురించి వివరంగా క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి...

కొత్త కండరాలు

కొత్త కండరాలు

ఒక సారి పాత ఇన్నోవాను దీనితో పోల్చి చూడండి. ఇందులో ముందు భాగం పూర్తిగా కండలు తిరిగిన డిజైన్‌ను అందించారు. ఇది చూడటానికి ఎంతో నూతనత్వాన్ని కలిగి ఉంది.

పెద్ద నోరు.

పెద్ద నోరు.

దీని ముందు భాగం గమనించండి. చాలా ఎక్కువగా ఇన్‌లెట్ స్పేస్ ఉంది కదా. ఇది ఎక్కువ గాలిని ఇంజన్ దగ్గరకు చేరవేయడంలో సహాయపడుతుంది. దీని వలన ఇంజన్ కూలింగ్ అవుతుంది. మరియు చూడటానికి ఎంతో అందంగా కూడా కనపడుతుంది.

మిరుమిట్లుగోలిపే లైట్లు

మిరుమిట్లుగోలిపే లైట్లు

కొత్తగా దీనికి అమర్చిన యల్‌ఇడి ప్రొజెక్టర్ ముందు వైపు లైట్లు చక్కటి లైటింగ్‌ను ఇస్తాయి.

వెనకవైపు అందాలు

వెనకవైపు అందాలు

ఇలాంటి డిజైన్‌ను మీరు ఎప్పుడైనా చూశారా? టాప్ రూఫ్ చివరికి వచ్చేసరికి కొంచెం క్రిందకి వంచబడి ఉంది. మరియు డిక్కి డోర్‌లోకి కొన్ని లైట్లను చొప్పించారు.

స్మార్ట్ కీ

స్మార్ట్ కీ

ఈ సరి కొత్త ఇన్నోవాలోకి స్మార్ట్ కీ ద్వారా ప్రవేశించడం ఇప్పుడు ఎంతో సులభమైపోయింది. ఈ స్మార్ట్ కీ కి ఒక సారి థ్యాంక్స్ చెబుదామా.

లోపలి ఎలా మారిపోయిందో ఒక సారి చూడండి.

లోపలి ఎలా మారిపోయిందో ఒక సారి చూడండి.

ఇందులో గల ఇంటీరియర్‌ను పూర్తిగా మార్చేశారు. మరియు టయోటా ఇన్నోవాలోని టాప్ ఎండ్ వేరియంట్స్‌లో చెక్కతో తయారు చేసిన డ్యాష్‌బోర్డ్‌లను అందించారు.

స్టీరింగ్ అడ్జెస్ట్‌మెంట్

స్టీరింగ్ అడ్జెస్ట్‌మెంట్

ఇందులో గల స్టీరింగ్‌ను మనకు అవసరమైన విధంగా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.

నూతన టెక్నాలజీతో వచ్చిన ప్యానెల్

నూతన టెక్నాలజీతో వచ్చిన ప్యానెల్

ఇందులో వచ్చిన కొత్త ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో వివిధ రకాల సమారం తెలుసుకునే అవకాశం కల్పించారు. దాదాపుగా అన్ని రకాల సమాచారాన్ని వివిద రకాల లైట్లుతో తెలుసుకునే అవకాశం కల్పించారు.

 మల్టీమీడియా

మల్టీమీడియా

ఇందులో ఎనిమిది అంగుళాల తాకే తెర పరిమాణం ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ కలదు. వాయిస్ మరియు గెస్ట్చర్ కంట్రోల్స్ ఇందులో ఉన్నాయి. కనెక్టివిటి ఆప్షన్స్ అయిన హెచ్‌డియమ్‌ఐ, బ్లూటూత్, మిరాక్యాస్ట్ లను మీ స్మార్ట్‌ ఫోన్‌తో కనెక్ట్ ‌చేసుకునే వెసులుబాటు ఉంది.

ఆటోమేటిక్ గేర్ బాక్స్

ఆటోమేటిక్ గేర్ బాక్స్

ఈ కొత్త తరం ఇన్నోవాలో ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ ఆప్షన్ కలదు. మీరు దీనిని మ్యాన్యువల్ మోడ్ నుంచి స్పోర్ట్ మోడ్‌కు మార్చుకున్న తరువాత దీనిని నడపడం ఎంతో సులభమైపోతుంది.

ముని వ్రేళ్లతో కంట్రోల్ చేయండి.

ముని వ్రేళ్లతో కంట్రోల్ చేయండి.

ఇక్కడ ఉన్న ఫింగర్ కంట్రోలర్‌‌తో కారులో గల విండో మిర్రర్‌లను డ్రైవర్ చేత సులభంగా ఆపరేట్ చేయవచ్చు.

భద్రత

భద్రత

సరి కొత్త ఇన్నోవాలో డ్యుయల్ యస్‌ఆర్‌యస్ ఎయిర్ బ్యాగులను అందించారు. ఇక స్టాండర్డ్ మోడల్ ఇన్నోవాలో వీటితో పాటు మోకాళి ఎయిర్ బ్యాగులను డ్రైలర్‌కు మరియు ఫ్రంట్ సైడ్ ప్యాసింజర్‌కు అందించారు. కారులోని రెండవ వరుసలో క్యాప్టెన్ సీట్లు కల్పించారు.

సరికొత్త ఇంజన్

సరికొత్త ఇంజన్

ఈ సరి కొత్త 2016 టయోటా ఇన్నోవాలో 2.4-లీటర్ టర్బో డీజల్ ఇంజన్ కలదు. ఇది 147బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర

ధర

2016 టయోటా ఇన్నోవా ప్రారంభ వేరియంట్ యొక్క ధర దాదాపుగా రూ. 12 లక్షల వరకు ఉండనుంది.

టయోటా గురించి మరింత సమాచారం

More from DriveSpark

Article Published On: Saturday, November 14, 2015, 12:35 [IST]
English summary
2016 Toyota Innova: Official Exterior & Interior Images
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+