హైదరాబాద్‌లో కొత్త టొయోటా ఇన్నోవా, ఫార్చ్యూనర్ విడుదల
జపనీస్ కార్ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ మోటార్, ఇటీవలే దేశీయ విపణిలో విడుదల చేసిన సరికొత్త ఇన్నోవా ఎమ్‌పివి మరియు ఫార్చ్యూనర్ 4x4 ఆటోమేటిక్ వేరియంట్‌లను తాజాగా హైదరాబాద్ మార్కెట్లో కూడా విడుదల చేసింది.
రాష్ట్ర మార్కెట్లో ఈ కొత్త 2015 టొయోటా ఇన్నావా ఎమ్‌పివి ధరలు రూ.12.64 లక్షల నుంచి రూ.16.01 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్). అలాగే.. కొత్త టొయోటా ఫార్చ్యూనర్ 4x4 ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ.24.51 లక్షల నుంచి రూ.25.78 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్).

పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతుండచం అలాగే వడ్డీ రేట్లు కూడా దిగొస్తుండటంతో, రానున్న రోజుల్లో మార్కెట్లో మరింత వృద్ధికి అవకాశం ఏర్పడగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. భారత మార్కెట్లో ఇన్నోవా బ్రాండ్‌ను ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ అప్‌డేటెడ్ మోడల్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
కొత్త ఇన్నోవాలో ఉడ్ ఫినిష్ స్టీరింగ్ వీల్, ఓక్ ఇంటీరియర్స్, రీడిజైన్డ్ లెథర్ సీట్స్, డార్క్ గ్రే డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు ఉన్నాయి. కాగా.. ఇంజన్ పరంగా మాత్రం కొత్త ఇన్నోవాలో ఎలాంటి మార్పులు లేవు.

టొయోటా ఫార్చ్యూనర్ ఫోర్-వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ వేరియంట్‌లో ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్, నావిగేషన్ సిస్టమ్, వాయిస్ కమాండ్స్, టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, 17-ఇంచ్ 12-స్పోక్ డార్క్ గ్రే అల్లాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్స్ విత్ సిల్వర్ కేసింగ్, స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్ అండ్ టెయిల్ ల్యాంప్స్ వంటి మార్పులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








