ఉత్తమ డిసెంబర్ ఆఫర్లను ప్రకటించిన టయోటా మోటార్స్
సంవత్సరాంతం సంధర్బంగా ఇప్పటికే కొన్ని వాహన సంస్థలు వివిధ రకాల ఆఫర్లను ప్రకటించాయి. ఇప్పుడు అదే బాటలో టయోటా కూడా నడుస్తోంది. అంటే టయోటా మోటార్స్ ఈ డిసెంబర్ నెల మీద వివిధ రకాల ఆఫర్లను తమ మోడల్స్ మీద ప్రకటించారు. ఈ 2015 డిసెంబర్ టయోటా ఆఫర్లు డిసెంబర్ 31, 2015 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Also Read: 2015 సంవత్సరంలో భారతీయు ఎక్కువగా ఇష్టపడిన టాప్-20 కార్లు.
అంతే కాదండోయ్ ఈ ఆఫర్ల మీద టయోటా మళ్లీ ఓ మెలిక పెట్టింది. ఈ ఆఫర్లను దేశ వ్యాప్తంగా ఉన్న 15 ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంచారట. మరి మన తెలుగు రాష్ట్రాలు ఈ లిస్ట్‌లో ఉందా ? ఉంటే, ఏ మోడల్స్ మీద ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దామా ? అయితే క్రింద గల స్లైడర్‌ల మీద కాస్త దృష్టి పెట్టండి.

టయోటా మోటార్స్ తమ డిసెంబర్ ఆఫర్లను ఈ 15 రీజియన్‌లో అందుబాటులో ఉంచింది. ఢిల్లీ యన్‌సిఆర్, గుర్గావ్, హర్యానా, పంజాబ్, హిమాచల్, కేరళ, తమిళనాడు, ముంబాయ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, సిక్కిం, గోవా, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్.

ఒక్కో ప్రాంతానికి సంభందించి ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించారు. ఢిల్లీలో టయోటా కర్రోలా ఆల్టిస్ మీద రూ. 50,000 వరకు ప్రయోజనాలను ప్రకటించారు. ఎటియోస్ మరియు ఎటియోస్ క్రాస్ కార్ల మీద దాదాపుగా రూ. 45,000 రుపాయల వరకు ఆఫర్లు ఉన్నాయి.

ఈ రెండు ఎటియోస్ మరియు ఎటియోస్ క్రాస్ మోడల్స్ మీద ఈ 45,000 రుపాయల ఆఫర్ వద్దు అనుకునే వారికి ఆకర్షణీయంగా 4.99 శాతం వడ్డీ రేటును ప్రకటించింది.

భారతీయ మార్కెట్లోకి ఈ మధ్యనే ప్రవేశ పెట్టిన ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ కారు మీద టయోటా మోటార్స్ దాదాపుగా 40,000 రుపాయల వరకు ప్రయోజనాలను ప్రకటించారు. మరియు అతి తక్కువ వడ్డీ రేటు 4.99 శాతం ఉండేట్లు కల్పించారు.

టయోటా మోటార్స్ లో ఇన్నోవా ఒక ముఖ్యమైన వాహనం. టయోటా దీని మీద కూడా దాదాపుగా 40,000 రుపాయల వరకు ప్రయోజనాలను లేదా తక్కువ వడ్డీ రేటు 7.99 శాతం ప్రకటించారు.

టయోటా వారి యస్‌యువి లలో బాగా పాపులారిటి పొందిన మోడల్ ఫార్చ్యూనర్ మీద డిసెంబర్ ఆఫర్లను ప్రకటించింది. అయితే ఇందులో కొన్ని సెలెక్ట్ చేయబడిన వేరియంట్ల మీద మాత్రమే ఆఫర్లు ఉన్నట్లు మరియు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఏ యే ప్రాంతాలలో టయోటా కార్ల ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

- డిసెంబర్ 11,12,13 లలో భారీ ఆఫర్లను ప్రకటించిన ఫోర్డ్ మోటార్స్
- ఏడు కార్ల మీద అద్బుతమైన ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్ మోటార్స్


Click it and Unblock the Notifications








