హోండా సిటి మరియు హ్యుందాయ్ వెర్నాలకు పోటిగా సరి కొత్త టయోటా వియోస్.
ప్రస్తుతం మార్కెట్లో మధ్యరకపు సెడాన్‌లలో మంచి పేరున్న కారు హోండా సిటి. ఎంతగా అంటే గడిచిన ఏప్రిల్-సెప్టెంబర్ త్రైమాసికంలో 89,669 కార్లను అమ్మి ఏకంగా 16 శాతం అమ్మకాల వృద్దిని నమోదు చేసుకుంది. ఇక హ్యుందాయ్ వెర్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే హోండా సిటి రాకముందు నుండి వెర్నా హవా నడుస్తూనే వచ్చింది.
దేశీయంగా తయారీని చేపట్టిన జపనీస్ కార్ల తయారి సంస్థ టయోటా మోటో కార్ప్ వీటన్నింటికి గట్టి పోటిని ఇవ్వడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే టయోటా మోటార్స్ ఇప్పుడు తన సరి కొత్త వియోస్‌ను అందిస్తోంది.
మీ నగరంలో మీకు నచ్చిన కారు యొక్క ధరలు తెలుసుకోండి.
ఈ సరి కొత్త టయోటా వియోస్ కు చెందిన మరిన్ని విశేషాలను క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి...

మొదట ఎక్కడ :
టయోటాకు చెందిన వియోస్ కారు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. మొదటగా దీన్ని ఆసియా ఫసిఫిక్, థాయిలాండ్ వంటి దేశాల్లో విడుదల చేయనున్నారు. ఈ కారును 2018 జనవరికి భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ఇంజన్ :
టయోటా ప్రస్తుతం రెండు ఇంజన్ ముఖ్యమైన ఇంజన్‌ల మీద ఆధారపడి ఉంది. అవి 1.6-లీటర్ పెట్రోల్ మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్. ఇక భారత్‌లో అయితే 1.4-లీటర్ డీజల్ ఇంజన్(టయోటా కర్రోలా కారులో ఉంది) మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (ఎటియోస్ సెడాన్‌లో ఉంది).

మలేషియాలో :
మలేషియాలో టయోటా వియోస్ 1.5-లీటర్ వివిటి-ఐ పెట్రోల్ ఇంజన్‌లో లభ్యంకానుంది మరియు ఇందులో 5-స్పీడ్ మ్యాన్యవల్ ట్రాన్స్‌మిషన్, 4-స్పీడ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ ట్రాన్స్‌మిషన్ అను రెండు వేరియంట్లలో లభించనుంది.

ఇండియాలో :
టయోటా వియోస్ మలేషియాలో అందించిన ఇంజన్ ఇంజన్ వేరియంట్లలో ఇండియాలో లభ్యం కానుంది మరియు విడుదల సమయానికి ఇందులో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే ఉండనుంది. ఇసిటి ట్రాన్స్‌మిషన్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తుంది.

ధర :
మలేషియాలో టయోటా వియోస్ ధర ఆర్‌యమ్ 75,000 అంటే మన ఇండియా రుపాయల్లో 13 లక్షలు. అయితే మన ఇండియాలో ఉన్న పోటికి అనుగుణంగా టయోటా వియోస్ ప్రారంభ ధర రూ. 7 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర 11 లక్షల వరకు ఉండనుంది.

పోటి :
ఈ సరి కొత్త టయోటా వియోస్ ప్రస్తుతం భారత్‌లో ఉన్న మధ్యరకపు సెడాన్‍లు అయిన హోండా సిటి మరియు హ్యుందాయ్ వెర్నాలకు గట్టి పోటీగా నిలవనుంది. ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే అంత వరకు వేచి చూడాలి మరి.

ఫీచర్లు :
టయోటా వియోస్‌లో గల ఫీచర్లు ప్రస్తుతం ఎటియోస్ సెడాన్ మరియు ఎటియోస్ లివో హ్యాచ్‌బ్యాక్‌ల ఫీచర్లు అభివృద్దిపరిచి ఈ కొత్త కారులో అందివ్వనున్నారు.


Click it and Unblock the Notifications