మార్కెట్లోకి కొత్త బీటిల్ కారును విడుదల చేయనున్న వోక్స్‌వ్యాగన్
వోక్స్‌వ్యాగన్ ఇండియా మన ఆటోమొబైల్ మార్కెట్లోకి తమ కొత్త బీటిల్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇంతకు ముందు ఈ బీటిల్ కారును తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ బీటిల్ కారును డిసెంబర్ 19, 2015 న విడుదల చేయనున్నారు.
Also Read: మారుతి సుజుకి యస్-క్రాస్ ప్రీమియా ఎడిషన్ కారు విడుదల: ధర కోసం...
అసలు ఏంటి ఈ బీటిల్ అని ఆలోచిస్తున్నారా ? తెలగులో వచ్చిన రామయ్యావస్తావయ్యా సినిమా చూశారా ? అందులో సమంత కాలేజ్‌కి ఒక కారులో వస్తుంది కదా, అదేనండి బీటిల్ కారు. ఈ మరి త్వరలో విడుదల అవుతున్న ఈ బుజ్జి కారు గురించి క్రింది కథనాల ద్వారా మరింత తెలుసుకుందాం రండి.

బీటిల్ ఇంజన్
వోక్స్‌వ్యాగన్ వారి అరుదైన కొత్త కారులో 1.4-లీటర్ టియస్‌ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ కలదు. ప్రపంచ వ్యాప్తంగా వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారు చాలా ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో కలదు.

బీటిల్ ట్రాన్స్‌మిషన్
ఈ పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 149బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారులో 7-స్పీడ్ ఆటోమేటిక్ డియస్‌జి ట్రాన్స్‌మిషన్ కలదు.

లభించు రంగులు
ఈ సరి కొత్త వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారు నాలుగు విభిన్న రంగుల్లో లభించును
- ఆరేంజ్
- నీలం
- ఎరుపు
- తెలుపు
- కేవలం లక్షరుపాయలకే వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారు బుకింగ్
- బీటిల్ మోడల్ కారును భారత దేశానికి దిగుమతి చేయనున్న వోక్స్‌వ్యాగన్
ఈ వోక్స్‌వ్యాగన ఈ రంగులకు ప్రత్యేత పేర్లను పెట్టి విడుదల చేయనుంది

ఫీచర్లు
ఈ కొత్త బీటిల్ కారులో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, పగటి పూట వెలిగే బి-జెనాన్ యల్‌ఇడి లైట్లు, ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ లో అక్కడక్కడ క్రోమ్ పరికరాలను ఉపయోగించారు.

ఇంటీరియర్
కొత్త బీటిల్ కారులో గల ఇంటీరియర్ మూడు విభిన్న రంగుల్లో లభిచనుంది. అంతే కాకుండా ఇందులో కీ లెస్ యాక్సెస్ మరియు పుష్ బటన్ స్టార్ట్, కొత్త ప్యానరొమిక్ సన్‌రూఫ్ మరియు లెథర్ ఇంటీరియర్ వంటి కొత్తవి ఉన్నాయి.

సిబియు
భారతీయ మార్కెట్లోకి విడుదల చేయబోతున్న వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారు కంప్లీట్లి బిల్ట్ యూనిట్ ఆప్షన్‌తో వస్తోంది.

బీటిల్ ధర
వోక్స్‌వ్యాగన్ ఇకోనిక్ హ్యాచ్‌బ్యాక్ అయిన ఈ బీటిల్ కారు ధర దాదాపుగా రూ. 25 లక్షల ఎక్స్-షోరూమ్ గా ఉండవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తో కలిసి ఉండండి, మరిన్ని కార్ల న్యూస్ తెలుసుకోండి.



Click it and Unblock the Notifications








