పోలో లిమిటెడ్ ఎడిషన్ విడుదల : అక్టోబర్ 9 నుండి అందుబాటులోకి

By Anil

వోక్స్ వ్యాగన్ తమ పోలో నుండి అత్యంత సున్నితమైన కారును లిమిటెడ్ ఎడిషన్‌గా ఈ పండుగ సీజన్ కోసం విడుదల చేశారు. ఇప్పటికే చాలా ఆటోమొబైల్ కంపెనీలు పండుగ సీజన్ కోసం ఎన్నో కొత్త కార్లను దేశవ్యాప్తంగా తమ షోరూమ్‌లలో అందుబాటులోకి తెచ్చారు.

ఇదే తరహాలో వోక్స్ వ్యాగన్ కూడా పోలో మోడల్‌నుండి అత్యంత సున్నితమైన కారును లిమిటెడ్ ఎడిషన్‌గా మార్కెట్లోకి విడుదల చేశారు. దీనిని ఈ నెల 9 వ తేది నుండి అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంచనున్నారు.
Also Read: అమ్మకాలకు సిద్దమైన రేంజ్ రోవర్ స్పోర్ట్ యస్.వి.ఆర్ : ధర, ఫీచర్స్..

ఈ కొత్త పోలో యొక్క మరిన్ని విశేషాలను క్రి్ంది కథనాల ద్వారా తెలుసుకుందాం...

లాభాలు :

లాభాలు :

జర్మనికి చెందిన ప్రముఖ కార్ల తయారిదారులైన వోక్స్ వ్యాగన్ పండుగ సంధర్భంగా గొప్ప ఎక్స్‌చ్ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటించారు. ఎక్స్‌చ్ఛేంజి లాభాలు దాదాపుగా 10,000 రుపాయలు వరకు ఉన్నాయి.మరియు సున్నితమైన పోలో కారును తీసుకున్న వారికి లోయల్టి బోనస్ కింద 10,000 రుపాయలను అదనంగా అందిచనున్నారు.

ధర :

ధర :

  • వోక్స్ వ్యాగన్ సున్నితమైన పోలో పెట్రోల్ వేరియంట్ ధర రూ. 6.57 లక్షలు,
  • వోక్స వ్యాగన్ సున్నితమైన పోలో డీజల్ వేరియంట్ ధర రూ. 7.29 లక్షలు
  • (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లి గా ఉన్నాయి).

    ఫీచర్స్ :

    ఫీచర్స్ :

    ఇందులో ఫీచర్స్ దాదాపుగా సాధారణ పోలో వలె ఉంటాయి వాటికి అదనంగా ట్రంక్ మీద క్రోమ్‌తో అందంగా మార్పుచేయబడి ఉంటుంది. మరియు దీని బాడి పక్కవైపులా కూడా మోల్డ్ చేయబడి ఉంటుంది. దీని టాప్ మీద నల్లటి రేకుతో ఫినిషింగ్ చేయబడి ఉంటుంది.

    ఇంటీరియర్ :

    ఇంటీరియర్ :

    క్యాబిన్ లోపలి వైపున కొన్ని కొత్త మార్పులుతీసుకువచ్చారు. ఇందులో క్రీమ్ కలర్‌తో సీట్ కవర్లు ఉన్నాయి, ఫ్లోర్ మ్యాట్లు కూడా అదేరంగులో ఉన్నాయి. మరియు ఇందులో అందమైన స్కఫ్ ప్లేట్లు ఉన్నాయి.(పక్కన గల ఫోటోలో పోలో అని ఉన్న ప్రాంతాన్ని స్కఫ్ ప్లేట్ అంటారు).

    స్పెసిఫికేషన్స్ :

    స్పెసిఫికేషన్స్ :

    ఇందులో గల క్యాబిన్ ఫినిషింగ్ పూర్తిగా ఫైబర్‌తో చేశారు. మ్యూజిక్ సిస్టమ్ ప్రదేశంలో కూడా ఇలాంటి ఫినిషింగ్ ఇచ్చారు.మరింత సౌకర్యం కోసం విడదీయడానికి వీలులేకుండా ఉండే విండోలను ఇచ్చారు.

    ఇంజన్ :

    ఇంజన్ :

    మెకానికల్ పరంగా ఇంతకు ముందు ఉన్న పోలో కారుతో పోల్చితే ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. అయితే ఇందులో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ను అందుబాటులోకి తెచ్చారు. దీనిని ఇంజనీర్లు ఎంతో చక్కగా రూపొందించారు.

     భద్రత :

    భద్రత :

    వోక్స్ వ్యాగన్‌కు చెందిన అన్ని మోడల్స్ కూడా భద్రత పరంగా బాగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇది ఎన్‌సిఎపి అనే భద్రత సంస్థ నుండి 4-స్టార్ రేటింగ్ంను పొందింది మరియు ఇందులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు, ముందువైపున రెండు ఎయిర్ బ్యాగ్‌లను ఇది పొందింది.

Article Published On: Saturday, October 10, 2015, 18:12 [IST]
English summary
Volkswagen Polo Exquisite has been launched in India as a limited edition model prior to the festive season. It will be available across showrooms from the 9th of October 2015.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+