హాటెస్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియాలో విడుదల చేయనున్న ఫోక్స్‌వ్యాగన్
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ గడచిన సంవత్సరంలో తమ రిఫ్రెష్డ్ పోలో హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. గ్లోబల్ మార్కెట్లలో ఫోక్స్‌వ్యాగన్, రేసింగ్ ప్రియులకు ఇష్టమైన మరిన్ని ఇతర పవర్‌ఫుల్ మోడళ్లను కూడా విక్రయిస్తోంది. అలాంటి హాట్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఓ దానిని ఫోక్స్‌వ్యాగన్ భారత్‌కు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
గతంలో ఫోక్స్‌వ్యాగన్ తమ శక్తివంతమైన జిటి శ్రేణి కార్లను ఇండియాలో విడుదల చేసింది. ఆ సమయంలో ఇవి పెద్దగా కస్టమర్లను ఆకట్టుకోలేకపోయాయి. కానీ, కంపెనీ ఆశలు కోల్పోకుండా రిఫ్రెష్డ్ వెర్షన్ పోలో ఆధారంగా తయారు చేసిన జిటి మోడళ్లను తిరిగి భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి మోడళ్లు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తాయి.

పెట్రోల్ వెర్షన్ ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి కారులో 1.2 లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్‌పిల శక్తిని, 175 ఎన్ఎమ్‍ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 16.47 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.
డీజిల్ వెర్షన్ ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి కారులో 1.5 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‍ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 19.91 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.
డ్రైవింగ్ అనుభూతిని మరింత పెంచేందుకు రేస్ నుంచి స్ఫూర్తి పొంది ఈ పోలో జిటి కార్లను డిజైన్ చేశారు. యాక్టివ్ సస్పెన్షన్, అడాప్టివ్ డ్యాంపర్స్, పవర్‌ఫుల్ ఇంజన్‌లతో ఇవి రూపుదిద్దుకోనున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








