వోక్స్‌వ్యాగన్ కంపెనీని తిరిగి పునరుద్దరించడానికి 5-పాయింట్ల ప్లాన్ సిద్దం చేసుకుంది.
వోక్స్‌వ్యాగన్ కార్ల అమ్మకాలకు సంభందించి తీవ్రమైన రికార్డులు నెలకొల్పింది. వోక్స్‌వ్యాగన్ తన 15 సంవత్సరాల చరిత్రలో మొదటి త్రైమాసికంలో దాదాపు 1.2 బిలియన్ పౌండ్ల నష్టం చవిచూసింది. అయితే ఎంతో కాలంగా వోక్స్‌వ్యాగన్ డీజల్ ఉద్గార పరీక్షలను మోసం చేసిందనే కుంభకోణంలో ఇరుకున పడిపోయింది. ఈ కుంభ కోణం నుండి బయటపడటానికి దాదాపుగా 4.8 బిలియన్ పౌండ్లను ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: బాలీవుడ్ తారలు మరియు వారి కార్ నెంబర్ల వెనకున్న రహస్యాలు-ప్రత్యేక కథనం
ఇప్పటి వరకు నష్టాలను చవిచూసిన వోక్స్‌వ్యాగన్ ఈ సంవత్సరం నుండి వృద్ది చెందుతుందని భావిస్తున్నారు. వోక్సవ్యాగన్ ఇలా నష్టాలను ఎదుర్కోవడం వలన టయోటా మోటార్స్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వాహనాలు అమ్మిన వాటిలో మొదటి స్థానంలో నిలిచింది.
Also Read: మరిన్ని వోక్స్‌వ్యాగన్ కార్ల గురించి తెలుసుకోండి.
జర్మనీ కార్ల తయారి సంస్థ అయిన వోక్స్‌వ్యాగన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సి.ఇ.ఓ) అయిన మ్యాథిస్ ముల్లెర్ కంపెనీ అమ్మకాలు తిరిగి పుంజుకోవడానికి ఐదు మార్గదర్శకాలను విడుదల చేశాడు. అవేంటో చూద్దాం పదండి.....

మొదటి అడుగు
అన్నింటికే ముందుగా ప్రపంచ వ్యాప్తంగా డీజల్ ఉద్గార కుంభకోణానికి ప్రభావితులైన 11 మిలియన్ల వినియోదారులకు బాసటగా 4.8 బిలియన్ పౌండ్ల ద్వారా నష్టపరిహారం కల్పించడం.

రెండవ అడుగు
రెండవ ముఖ్యమై అడుగు ప్రస్తుతం ఈ కుంభ కోణానికి సంభందిచి విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయిన తరువాత ఈ కుంభ కోణం వెనుక ఎవరెవరు ఉన్నారో వారందరూ తీవ్ర పరిణామాలు ఎదుర్కుకోవాల్సి ఉంటుంది తెలిపారు.

మూడవ అడుగు
ఈ కొత్త సిఇఓ ప్రకారం ఈ కుంభకోణంలో ఎవరైనా ఉన్నత స్థాయి అధికారుల హస్తం ఉందని తేలితే వారిని ఆ పదవి నుండి తొలగించడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే వోక్స్‌వ్యాగన్ యొక్క మాజీ సిఇఓ వింటర్ మార్టిన్ ఈ కుంభ కోణం తరువాత తన సిఇఓ పదవి కి రాజీనామా చేశారు.

నాలుగవ అడుగు
ప్రస్తుతం కంపెనీ పరిదిలో గల దాదాపు 300 మోడళ్ల వరకు పరీక్షించనున్నట్లు తెలిపారు. ఇందులో ఈ అక్రమ సాఫ్ట్‌వేర్ వాడిన వాహనాలన్నింటిని తిరిగి పరీక్షించి వాటిలో ఉన్న సమస్యను తొలగించాలని నిర్ణయించారు.

ఐదవ అడుగు
ఇతని ఐదవ ప్రణాలిక ప్రకారం 2018 సంవత్సరం కాలం నాటికి 10 మిలియన్ వాహనాలు అమ్మకాలు జరిపాలని నిర్ణయించారు. మరియు ప్రతి ఉన్నత స్థాయి అధికారులు కంపెనీలో ఉన్న ప్రతి ఉద్యోగితో మమేకం కావాలని నిర్ణయించాడు.

ఈ వోక్స్‌వ్యాగన్ సిఇఓ ప్లాన్ ఫలించి, కంపెనీ ఒక ఉన్నత స్థానికి చేరుకుంటుందో లేదో అంత వరకూ వేచి చూద్దాం మరి.

టోక్యో మోటార్ షోలో సందడి చేస్తున్న కొత్త కార్లు


Click it and Unblock the Notifications








