ఇండియన్ రోడ్లపై టొయోటా రష్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టెస్టింగ్
ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో జోరు మీదున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి టొయోటా కూడా ప్రవేశిస్తుందా అని అడిగితే అవుననే సమాధానం చెప్పాలి. టొయోటా గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న రష్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇండియాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే, ఈ మోడల్‌ను కంపెనీ ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ కూడా చేస్తోంది.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ వద్ద టొయోటా రష్ కాంపాక్ట్ ఎస్‌యూవీని టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా క్యాప్చూర్ చేసిన స్పైషాట్స్ ఇప్పుడు నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఇది 4420 మి.మీ. పొడవును, 1745 మి.మీ. వెడల్పును, 1740 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 2685 మి.మీ. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో లభిస్తున్న సెకండ్ జనరేషన్ టొయోటా రష్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఆఫర్ చేస్తున్నారు.

ఈ ఇంజన్ గరిష్టంగా 107 పిఎస్‌ల శక్తిని, 141 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 200 మి.మీ. ఇదొక 5-సీటర్ ఎస్‌యూవీ. కావాలనుకుంటే కస్టమర్లు థర్డ్ రో సీట్ ఆప్షన్‌ను ఎంచుకొని దీనిని 5+2 సీటర్‌గా మార్చుకోవచ్చు.
ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, స్టయిలిష్ డిజైన్, సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన అత్యాధునిక భద్రతా ఫీచర్లతో ఇది లభ్యం కానుంది. భారత మార్కెట్లో టొయోటా రష్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధర సుమారు రూ.7.5 లక్షల నుంచి 12.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లో రెనో డస్టర్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్, నిస్సాన్ టెర్రానో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








