2016 మార్చి కార్ల అమ్మకాలు: రెనో క్విడ్‌కు అరుదైన స్థానం

By Anil

ఆటో మొబైల్ రంగంలో ఈ ఏడాదిలో కొన్ని కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో కొన్ని కొత్త కార్లు మార్కెట్లోకి విడుదల అవడం ఒకటయితే, అలా విడుదలయిన వాటిలో టాప్-10 అమ్మకాలలో చోటు సాధించడం ఒకటి.

ఫ్రెంచ్‌‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన క్విడ్ కారు భారీ స్థాయి అమ్మకాలతో టాప్-10 అమ్మకాలలో స్థానం దక్కించుకుంది. దీని దెబ్బతో హ్యుందాయ్ వారి బెస్ట్ సెల్లింగ్ కారు ఎలైట్ భారీ స్థాయిలో నష్టపోయింది. అయితే ఇక తరువాత వంతు మారుతి సుజుకి వారిది అని విమర్శలు వినిపిస్తున్నాయి. టాప్-10 లో క్విడ్ మరియు ఏ కారు ఏ స్థానంలో ఓ లుక్కేసుకుందాం రండి

10. హోండా సిటి

10. హోండా సిటి

సెడాన్ సెగ్మెంట్లో ఉత్తమ అమ్మకాలు సాధిస్తున్న కారు సిటి. ఇది గత ఏడాది ఇదే నెలలో 9777 అమ్మకాలతో ఆరవ స్థానంలో ఉండగా ఈ యేడు 10 వ స్థానానికి దిగజారిపోయింది. ప్రస్తుతం 5,662 యూనిట్ల అమ్మకాలు జరిపి ఎంట్రీ లెవల్ కార్లతో గట్టి పోటిని ఎదుర్కుంటోంది.

హోండా సిటి

హోండా సిటి

హోండా సిటి సెడాన్ కార్లలో గట్టి పోటిని ఎదుర్కుంటోంది. దీని ఇండియన్ మార్కెట్లో ఉన్న ఏకైక పోటిదారు హ్యుందాయ్ వెర్నా. ప్రస్తుతం సిటి పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ 7.96 మరియు డీజల్ 9.22 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

9. మారుతి సుజుకి బాలెనొ

9. మారుతి సుజుకి బాలెనొ

మారుతి సుజుకి వారి లేటెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు బాలెనొ అత్భుతమైన డిజైన్ కారణంగా భారీ స్థాయిలో అమ్మకాలు సాధించి అనతి కాలంలోనే టాప్-10 అమ్మకాల జాబితాలో స్థానం సంపాదించింది. గడిచిన నెలలో 6,236 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకుని తొమ్మిదవ స్థానాన్ని కైవసం చేసుకుంది.

మారుతి సుజుకి బాలెనొ

మారుతి సుజుకి బాలెనొ

మారుతి సుజుకి వారి బాలెనొ కారు పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ల ధరలు వరుసగా 5.15 మరియు 6.34 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉన్నాయి.

8. ఎలైట్ ఐ20

8. ఎలైట్ ఐ20

హ్యుందాయ్ వారి బెస్ట్ సెల్లింగ్ హాట్ హ్యాచ్ కారు ఎలైట్ ఐ20. గత ఏడాది ఇదే సమయానికి ఐదవ స్థానంలో ఉండగా రెనొ వారి క్విడ్ ఎంట్రీ కారణంగా మూడు స్థానాలు దిగువకు పడిపోయింది. మార్చి 2016 లో 8,713 యూనిట్ల అమ్మకాలు సాధించి ఎలైట్ ఐ20 కారు ఎనిమిదవ స్థానానికి పరిమితం అయ్యింది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ వారు ఎలైట్ ఐ20 కారులో శక్తివంతమైన పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను అందించింది. అందులో పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.54 లక్షలు మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 6.75 లక్షలుగా ఉన్నాయి.(రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)

7. మారుతి సుజుకి సెలెరియో

7. మారుతి సుజుకి సెలెరియో

గత ఏడాది ఇదే నెలలో మారుతి సుజుకి వారి సెలెరియో కారు 5074 యూనిట్ల అమ్మకాలతో 10 వ స్థానంలో ఉండాకి, ప్రస్తుతం 2016 మార్చి నెలలో 8859 యూనిట్ల అమ్మకాలు జరిపి ఏడవ స్థానానికి చేరుకుంది.

మారుతి సుజుకి సెలెరియో

మారుతి సుజుకి సెలెరియో

మారుతి సుజుకి వార రెండవ ఉత్పత్తి సెలెరియో ఈ టాప్-10 జాబితాలో స్థానం చోటు దక్కించుకుంది. ఇందులో పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ల ధరలు 4.03 మరియు 4.82 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

6. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

6. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ వారి గ్రాండ్ ఐ10 గత ఏడాది ఇదే నెలలో అమ్మకాలలో 7 వ స్థానంలో ఉండగా, గడిచిన మార్చి అమ్మకాలలో 9544 యూనిట్లు అమ్ముడుపోయి ఆరవ స్థానంలో ఉంది. మొత్తం మీద చూస్తే క్విడ్ ప్రభావం హ్యుందాయ్ వారి కార్ల అమ్మకాల మీద తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ వారి గ్రాండ్ ఐ10 కారు పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ధరలు 4.85 మరియు 5.75 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

5. రెనో క్విడ్

5. రెనో క్విడ్

ఇది అత్భుతమైన విజయం అని చెప్పవచ్చు. ప్రస్తుతం హ్యుందాయ్ వారి అమ్మకాల మీద తీవ్ర ప్రభావం చూపిన క్విడ్ మారుతి వారి కార్ల మీద కూడా ఇదే తీరును కనబరచనుంది. గడిచిన మార్చి నెలలో 9743 యూనిట్ల అమ్మకాలు సాధించి ఐదవ స్థానంలో ఉంది.

రెనో క్విడ్

రెనో క్విడ్

రెనో క్విడ్ ప్రస్తుతం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో 799సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు, ఇది దాదాపుగా లీటర్‌కు 25.17 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది. అయితే ఇందులో ప్రారంభ వేరియంట్ 2.60 మరియు టాప్ ఎండ్ వేరియంట్ 3.64 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

4.మారుతి సుజుకి స్విఫ్ట్

4.మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి వారి మూడవ ఉత్పత్తి ఈ టాప్-10 జాబితాలో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది ఇదే నెలలో మూడవ స్థానంలో ఉండగా ప్రస్తుతం మార్చి నెలలో 14524 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకుని నాలుగవ స్థానానికి పరిమితం అయ్యింది.

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి వారి స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ ప్రతి నెలలాగే బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్‌లలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు 1197 సీసీ కెపాసిటి గల పెట్రోల్ మరియు 1248 సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లు కలవు. పెట్రోల్ మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ధరలు 4.72 మరియు 5.97 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

3. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

3. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

మారుతి సుజుకి వారి వ్యాగన్ ఆర్ కారు గత ఏడాది ఇదే నెలలో టాప్-10 జాబితాలో నాలుగవ స్థానంలో నిలవగా ఈ యేడు 14577 యూనిట్ల అమ్మకాలతో మూడవ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇది మారుతి వారి నాలుగవ ఉత్పత్తి.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

మారుతి సుజుకి సంస్థ ఈ వ్యాగన్ ఆర్ కారులో 998సీసీ కెపాసిటి గల పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంజన్‌లను అందించింది. ఇవి రెండు 20.5 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది. పెట్రోల్ మరియు సిఎన్‌జి ప్రారంభ వేరియంట్ ధరలు 4.08 మరియు 4.63 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

2.మారుతి సుజుకి స్వఫ్ట్ డిజైర్

2.మారుతి సుజుకి స్వఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి వారి ఐదవ ఉత్పత్తి డిజైర్ ఈ టాప్-10 జాబితాలో రెండవ స్థానంలో కలదు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఉత్తమ అమ్మకాలు సాధిస్తున్న కాంపాక్ట్ సెడాన్‌లలో డిజైర్ మొదటి స్థానంలో కలదు. ఇది ఈ ఏడాది మార్చిలో 17796 యూనిట్ల అమ్మకాలు సాధించి రెండవ స్థానంలో నిలిచింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి వారు తమ స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారులో 1197సీసీ కెపాసిటి గల పెట్రోల్ మరియు 1248సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లను కల్పించింది. ఇవి రెండు కూడా 20.85 మరియు 26.59 కిలోమీటర్ల మైలేజ్‌ ఇవ్వగలవు. పెట్రోల్ మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ధరలు 5.23 మరియు 26.59 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉన్నాయి.

 1. మారుతి సుజుకి ఆల్టో

1. మారుతి సుజుకి ఆల్టో

ఎన్నో నెలలు గడిచినా మారుతి వారి ఆల్టో ఈ స్థానాన్ని మాత్రం విడిచి వెల్లనంటోంది. ప్రతి నెలలాగే గత మార్చిలో కూడా 22101 యూనిట్ల అమ్మకాలు జరిపి మొదటి స్థానంలో నిలిచింది. మరి రెనో వారి క్విడ్ ఈ ఆల్టో స్థానాన్ని జప్తు చేస్తుందో లేదో కొంత కాలం వేచి చూడాలి మరి.

మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి ఆల్టో

టాప్-10 జాబితాలో వరుసగా ఆరవ స్థానంలో నిలిచింది మారుతి సుజుకి ఆల్టో. ఇందులో 746 సీసీ కెపాసిటి గల పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంజన్ కలవు. రెండు కూడా 22.79 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇవ్వగలవు. పెట్రోల్ మరియు సిఎన్‌జి ప్రారంభ వేరియంట్ ధరలు 2.57 మరియు 3.74 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

మరిన్ని కథనాలు మీకోసం......
  • లీఫ్ నెలలో టాప్ లేపిన కార్ల అమ్మకాలు
  • 2016 సంవత్సరానికి గాను బేస్ వేరియంట్లలో ఉన్న బెస్ట్ కార్లు
  • ఏప్రిల్ మరియు మే మధ్య విడుదల కానున్న కొత్త కార్లు
  • మరిన్ని కథనాలు మీకోసం......
    • జలాంతర్గామిని కోల్పోయిన నార్త్ కొరియా: అమెరికాపై ఆరోపణలు
    • భారతదేశపు రహస్య ఆయుధం కాళీ గురించి ఆసక్తికరమైన విషయాలు
    • ఖరీదైన కార్లు గల దక్షిణ భారత సినీతారలు

Most Read Articles

English summary
10 Highest Selling Cars In March 2016
Story first published: Monday, April 4, 2016, 11:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X