టాటా టియాగో కొనాలనుకుంటున్నారా ? టియాగో యొక్క ప్రతికూలతలు మరియు ప్రయోజనాలు
టాటా మోటార్స్ ఎన్నో ఏళ్లుగా హ్యాచ్‌బ్యాక్‌ల మార్కెట్లో కోల్పోయిన అమ్మకాలను తిరిగి తమ టియాగో హ్యాచ్‌బ్యాక్ ద్వారా రాబట్టుకోవాలని చూస్తోంది. అందుకోసం టియాగో కారును అన్ని విధాలుగా తయారుచేసి అమ్మకాలకు పూర్తిగా సిద్దం చేసుకుంది. ఇది టియాగో పట్ల టాటా వారి కథనం. మరి వినియోగదారులు దీనిని ఎంచుకోవచ్చా...? ఇందులో ఉన్న ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు వంటి వివరాలను క్రింది కథనం ద్వారా అందిస్తున్నాము. ఏదీ ఓ లుక్కేసుకోండి....

టాటా టియాగో ప్రతికూలతలు
టాటా మోటార్స్ వారు తయారు చేసే ప్రతి కారులోని బాడీ మరియు ఇతర ప్లాస్టిక్ భాగాల పరంగా నాణ్యతలో విఫలమైందని చెప్పవచ్చు ఈ కారణంగా అమ్మకాల పరంగా టాటా సరైన ఫలితాలను నమోదు చేయలేకపోతోందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం టియాగో గతంలోని మోడల్స్‌తో పోల్చితే పర్వాలేదనిపిస్తుంది.

టాటా మోటార్స్ టియాగోలో అందించిన పెట్రోల్ ఇంజన్ డీజల్ ఇంజన్ వలె శబ్దాన్ని ఇవ్వలేదు. ప్రత్యేకంగా ఇంజన్‌ను అన్ చేసే ముందుఈ అనుభూతిని పొందుతారు. అయితే డీజల్ ఇంజన్‌ల పరంగా టాటా మోటార్స్‌కు ఓ ప్రత్యేక లెక్కుంది.

ఇంటీరియర్ నాణ్యత పరంగా టాటా మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏ/సి వెంట్స్ చాలా వరకు క్లోజ్‌గా ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఇంటీరియర్‌లో మరింత నాణ్యత కోసం కష్టపడుతోంది.

ముఖ్యమైన కారణం పని తీరు, ఇందులోని పెట్రోల్ వేరియంట్ కారు 1,800 నుండి 3,000 ఆర్‌పిఎమ్ మధ్య అతి తక్కువ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం చాలా వరకు హ్యాచ్‌బ్యాక్ కార్లు చక్కటి పవర్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. కాబట్టి ఇందులో మరింత శక్తి ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటే బాగుండేది.

టాటా టియాగో అనుకూలతలు
టాటా సంస్థ తమ హ్యాచ్‌బ్యాక్ పరంగా కొంచెం మంచి మార్కులను పొందింది. తరువాత స్లైడర్ల ద్వారా టియాగో యొక్క్ అనుకూలతలు గురించి తెలుసుకుందాం.

టాటా మోటార్స్ భద్రత పరంగా ముందు వైపున రెండు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు కార్నరింగ్ స్టెబలిటి కంట్రోల్ వంటి ఫీచర్లు కలవు.

టాటా తమ టియాగో వినియోగదారులను ఆకర్షించడానికి కస్టమర్ల ప్రాధాన్యత ప్రకారం సింక్ సిస్టమ్ అందించారు.

టాటా మోటార్స్ సంస్థ ఈ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును యువతను దృష్టిలో ఉంచుకుని ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌ను డిజైన్ చేసింది. ఇందులో ఎక్కువగా తమ ముందు కార్లను పోలి ఉండే రూపాలు ఉన్నప్పట్టికీ పెట్రోల్ వేరియంట్ ఎంతో బాగా ఆకట్టుకుంటుంది.

పని తీరు పరంగా టాటా మోటార్స్ కంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. డీజల్ ఇంజన్‌ల పరంగా దీనిదే పై చేయి. అయితే కొత్తగా పరిచయం చేసిన పెట్రోల్ ఇంజన్ మిగతా హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే బాగానే అనిపిస్తుంది

ఇంటీరియర్ స్పేస్ పరంగా టాటా కార్లు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. అందులో ఈ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారులో క్యాబిన్ డిజైన్‌ను ఎక్కువగా సౌకర్యవంతంగా ఉండేట్లు డిజైన్ చేశారు. తద్వారా కారు ఇంటీరియర్ లోపల ప్రతి మూలకు ఏ/సి అందుతుంది.

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో ఆడియో సిస్టమ్ పరంగా హార్మన్/జుకి-కార్ యాప్ మరియు స్మార్ట్ ఫోన్ ఆధారిత న్యావిగేషన్ సిస్టమ్ కల్పించారు.

కారు రివర్స్ పార్కింగ్ చేస్తున్నపపుడు వేటినైనా ఢీ కొట్టే అవకాశాలు ఉన్నాయి అని ఆలోచిస్తే ఇందులో ఉన్న రివర్స్ పార్కింగ్ కెమెరా మీకు వెనుక వైపు దృశ్యాల్ని ఇన్పోటైన్‌మెంట్ వ్యవస్థలోని డిస్ల్పే మీద చూపుతుంది.

ఇందులో ఉన్న మరొక అపూర్వ ఫీచర్ క్లచ్ లాక్, దీని వలన కలిగే ప్రయోజనం మీరు క్లచ్‌ను బాగా అదిమి పట్టుకుని స్టార్ట్ చేయాలనుకుంటే మీ వల్ల కాదు. కారణం క్లచ్. చాలా మంది ఇలా చేస్తుంటారు ఇది చాలా తప్పు.

శబ్దం, అదుర్లు మరియు కుదుపులు సాదారణంగా టాటా వారి డీజల్ కార్లలో ఇది తరుచూ ఉండే సమస్య. అయితే ప్రస్తుతం టియాగో కారులో వీటిని చాలా వరకు తగ్గించేశారు. నిజంగా చెప్పాలంటే వీటి పరంగా చాలా వరకు అభివృద్ది సాధించిందని చెప్పవచ్చు.

సాదారణంగా టాటా వారి కార్లు తక్కువ రంగుల్లో లభించేవి. ప్రస్తుతం టియాగో కార్లు విసృత స్థాయి రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. అవి తెలుపు, సిల్వర్, బ్రౌన్, ఎరుపు, ఆరెంజ్ మరియు నీలం రంగులు.

తీర్పు
టాటా మోటార్స్ వారు తమ హ్యాచ్‌బ్యాక్ కారు మీద అన్ని అంశాల పరంగా దృష్టి సారించారు. ఫీచర్లు, రంగులు, ఇంజన్ ఆప్షన్లు, భద్రత ఫీచర్లు మరియు డిజైన్ పరంగా భారీ మార్పులు ఇలా అన్ని అంశాలు టియాగోను టాటా వారి ఉత్తమ ఉత్పత్తి అని చెబుతాయి. మా వరకు టాటా వారి హ్యాచ్‌బ్యాక్‌లలో ఇది ఉత్తమ ఉత్పత్తి అని చెప్తాము.

- మళ్లీ పుట్టిన నూతనత్వం: టయోటా క్రిస్టా వర్సెస్ టయోటా ఇన్నోవా
- భద్రత పరంగా భారతీయ మార్కెట్లో ఉన్న బెస్ట్ కార్లు
- వితారా బ్రిజాను విడుదల చేసిన మారుతి సుజుకి ధర రూ.6.99 లక్షలు


Click it and Unblock the Notifications








