తరువాత తరం కోసం తెర వెనుక డాసియా డస్టర్
తరువాత తరం కోసం యూరోపియన్ కార్ల తయారీ సంస్థ డాసియా నూతన 2017 డస్టర్ ను అభివృద్ది చేస్తోంది. వచ్చే ఏడాది దీనిని ప్రపంచ విపణిలోకి ప్రవేశపెట్టనుంది.
యూరోపియన్ ఆధారిత కార్ల తయారీ సంస్థ డాసియా తరువాత తరం కోసం తెర వెనుక మరో డస్టర్ ను అభివృద్ది చేస్తోంది. ప్రస్తుతం ఉన్న మోడల్‌కు డిజైన్, స్పేస్ మరియు సాంకేతిక అంశాల వంటి వాటి పరంగా అభివృద్ది చేసి 2017 నాటికి డాసియా డస్టర్ గా ప్రపంచ మార్కెట్ లోకి విడుదల కానుంది.

ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎస్‌యువి విపణిలోకి పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ డస్టర్‌లో డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జోడింపుతో ఫ్రంట్ సైడ్ నూతన డిజైన్ శైలిలో డాసియా దీనిని అభివృద్ది చేస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సరికొత్త డస్టర్ వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల ఖచ్చితం అని తెలిసింది. యూరోపియన్ మార్కెట్లో ఈ డస్టర్‌ను డాసియా ఆధ్వర్యంలో మరియు ఇతర విపణిలో, భారత్‌లో మాదిరిగా రెనో ఆధ్వర్యంలో ఈ డస్టర్ అందుబాటులోకి రానుంది.

రెండవ తరానికి చెందిన డస్టర్‌ను తమ నూతన ఉత్పత్తుల వేదిక కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ (CMF) ఆధారంగా రూపాంతరం చెందనుంది. ఇప్పటికే నిస్సాన్ మరియు రెనో సంస్థలు ఈ వేదిక మీద తమ నూతన ఉత్పత్తులను అభివృద్ది చేస్తున్నాయి.

సిఎమ్ఎఫ్ వేదిక ఆధారంగా నిర్మితమవుతోన్న డస్టర్ మునుపటి మోడల్ కన్నా ఎక్కువ వీల్ బేస్ కలిగి ఉంటూ ఇంటీరియర్‌లో మరో వరుస సీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

2017 డాసియా డస్టర్ గురించి సాంకేతిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఈ మోడల్ బ్రెజిల్ మార్కెట్లో 1.6-లీటర్ మరియు 2-లీటర్ ఇంజన్ సామర్థ్యంతో వచ్చే అవకాశం ఉంది.

యూరోపియన్ మార్కెట్లో డస్టర్ లో 1.5-లీటర్ డిసిఐ మరియు 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న శక్తివంతమైన డీజల్ ఇంజన్ వేరియంట్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం కలదు. ఇక ఇండియన్ మార్కెట్ విషయానికి వస్తే అవే ఇంజన్‌లు రానున్నాయి.

ఇప్పుడు జపాన్ లో త్వరలో భారత్ కు: 2017 స్విఫ్ట్ సమగ్ర వివరాలు
జపాన్ మార్కెట్లోకి సుజుకి తమ 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ను ఆవిష్కరించింది. దేశీయ విపణివైపు అడుగులేయనున్న దీని గురించి పూర్తి వివరాలు....

పోటీని ఎదుర్కోవడానికి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఆపసోపాలు
ఫోర్డ్ ఇండియా వచ్చే 2017 నాటికి ఇండియన్ మార్కెట్లోకి తమ ఎకోస్పోర్ట్ ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో పరిచయం చేయడానికి సిద్దమవుతోంది.

- ప్లేన్ క్రాష్ కు కారణమయ్యే కారణాలు తెలిస్తే షాక్ అవుతారు


Click it and Unblock the Notifications








