2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ రూపం మరియు సాంకేతిక వివరాలు

By Anil

ఫోర్డ్ ఇండియా వారి ఎకో స్పోర్ట్ బాగా విజయం సాధించిన నేపథ్యంలో దీనిని సరికొత్తగా 2017 ఇండియన్ మార్కెట్ కోసం అభివృద్ది చేస్తున్నారు. బ్రెజిల్‌లో కనబడిన ఈ ఎకో స్పోర్ట్ వచ్చే ఏడాది మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

2017 ఫోర్డ్ ఎకో స్పోర్ట్

అయితే లభించిన అతి రహస్య 2017 ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వాహనం యొక్క చిత్రాన్ని గమనించినట్లయితే ప్రస్తుతం ఉన్న దానితో పోల్చుకుంటే పెద్దగా మార్పులు ఏవీ చోటు చేసుకోలేదు. అత్యంత పకడ్భందీగా దీనిని అన్ని వైపులా కప్పివేసి మరీ పరీక్షలు నిర్వహించారు.
బ్రిజా ముందు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఆటలు ఇక మీదట సాగవు
2017 ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మనం సరికొత్త హెడ్ ల్యాంప్, పెద్ద ఫ్రంట్ గ్రిల్ మరియు స్టైలింగ్ పరంగా ఫోర్డ్ ఎండీవర్ రూపాన్ని కొంత మేర సంతరించుకోనుంది. ఇవి మినహాయించి ఎక్ట్సీరియర్ పరంగా మునుపటి ఎకో స్పోర్ట్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యువితో సమంగానే ఉంటుంది.

ఈ ఫోర్డ్ ఎకో స్పోర్ట్‌లో 131 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల సరికొత్త 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ రానున్నట్లు సమాచారం. అయితే ఇండియన్ మార్కెట్ కోసం ఇది 1.5 లీటర్ డీజల్ 1.5 లీటర్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ ఎకో బూస్ట్ ఇంజన్ ఆప్షన్‌లతో రానుంది.
మహీంద్రా యక్స్‌యువి5oo,హ్యుందాయ్ క్రెటా కార్ల మధ్య మొదలైన యుద్దం
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కు ప్రస్తుతం ఉన్న అతి ముఖ్యమైన పోటీ మారుతి వితారా బ్రిజా. దీనిని అనుసరిస్తూనే ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మీద ధరలను తగ్గించింది. అయితే మారుతి తమ డీజల్ వితారా బ్రిజాను కూడా 1.0 లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్‌ ఇంజన్‌లో విడుదల చేయడాన్ని సన్నాహాలు చేస్తోంది.
ఇండియన్ మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకి వారి 8 కార్లు
2017 నాటికి దేశీయంగా అందుబాటులోకి రానున్న సరికొత్త 2017 ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ధర సుమారుగా రూ. 6 నుండి 9.5 లక్షల మధ్య ఉండనుంది.

Source

Article Published On: Tuesday, June 14, 2016, 12:12 [IST]
English summary
Spy Image Of The New 2017 Ford EcoSport Are Out
Read more on: #ఫోర్డ్ #ford
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+