2017 హ్యుందాయ్ ఎలంట్రా సేఫ్: అతి త్వరలో విడుదల

By Anil

హ్యుందాయ్ మోటార్స్ అభివృద్ది చేస్తోన్న ఆరవ తరానికి చెందిన 2017 ఎలంట్రా త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే దీనికి టాప్ సేఫ్టీ పిక్ మరియు ఇన్సూరెన్స్ ఇన్‌స్ట్యూట్ ఫర్ హైవే సేఫ్టీ అమెరికా వారి ఆధ్వర్యంలో భద్రత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఇది మంచి మార్కులే సాధించింది. దీని గురించి పూర్తి వివరాలు.....

2017 హ్యుందాయ్ ఎలంట్రా

2017 కు చెందిన ఎలంట్రా సెడాన్ కారును హ్యుందాయ్ మోటార్స్ సెప్టెంబర్‌ 2016 లో దేశీయంగా ఆవిష్కరించనుంది. మరియు అమెరికాలో దీనికంటే ముందుగా ఆవిష్కరించనున్నారు.

2017 హ్యుందాయ్ ఎలంట్రా

హ్యుందాయ్ దీనిని స్పోర్ట్స్ వేరియంట్లో ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానుంది.

2017 హ్యుందాయ్ ఎలంట్రా

ఐదు విభాగాల్లో ఈ ఎలంట్రాకు క్రాష్ పరీక్షలు నిర్వహించారు. అన్నింటిలో కూడా మంచి ఫలితాలనే నమోదు చేసుకుంది.

2017 హ్యుందాయ్ ఎలంట్రా

క్రాష్ పరీక్షల్లో ఉన్న విభాగాలు మోడరేట్ ఓవర్‌ల్యాప్ ఫ్రంట్, సైడ్, స్మాల్ ఓవర్‌ల్యాప్ ఫ్రంట్, రూఫ్ స్ట్రెంథ్, మరియు హెడ్ రెస్ట్రైన్స్ వంటివి ఉన్నాయి.

2017 హ్యుందాయ్ ఎలంట్రా

ముందు వైపు క్రాష్ టెస్ట్‌ను గంటకు 19 కిలోమీటర్ల వేగం ఉన్నపుడు నిర్వహించగా తట్టుకోవడానికి ఇందులో ముందు వైపున క్రాష్ ప్రివెంషన్ సిస్టమ్‌ను అందించారు. తద్వారా మంచి ఫలితాలనే సాధించింది.

2017 హ్యుందాయ్ ఎలంట్రా

పాత తరం ఎలంట్రా కార్లలో క్రాష్ పరీక్షలు నిర్వహించినపుడు ప్రమాదా మూలాలు తొమ్మిది ఇంచుల వరకు క్యాబిన్‌లోనికి చొచ్చుకుని వెళ్లేవి, అయితే నూతన ఎలంట్రాలో కేవలం 2 ఇంచులు మాత్రమే ఉంది.

2017 హ్యుందాయ్ ఎలంట్రా

2017 ఎలంట్రాలో హ్యుందాయ్ మోటార్స్ 2.0-లీటర్ మరియు 1.6-లీటర్ ఇంజన్‌లను పరిచయం చేయనుంది.

2017 హ్యుందాయ్ ఎలంట్రా

2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ సుమారుగా 146బిహెచ్‌పి పవర్ మరియు 183ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

2017 హ్యుందాయ్ ఎలంట్రా

1.6-లీటర్ డీజల్ ఇంజన్ సుమారుగా 134బిహెచ్‌పి పవర్ మరియు 306ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

2017 హ్యుందాయ్ ఎలంట్రా

ఈ రెండింటిలో 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

2017 హ్యుందాయ్ ఎలంట్రా

టాటా టియాగోలో ఈ ఫీచర్ వస్తే ప్రభంజనమే !!

త్వరలో విడుదల కానున్న టయోటా వారి కార్ల జాబితా

Article Published On: Tuesday, August 2, 2016, 8:00 [IST]
English summary
6th Generation Hyundai Elantra Scores Highest Safety Rating By IIHS
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+