2017 హ్యుందాయ్ ఐ30 ఆవిష్కరణ

By Anil

హ్యుందాయ్ మోటార్స్ నూతన తరానికి చెందిన ఐ30 కారును యూరప్ కేంద్రంలోని ఫ్రాంక్‌ఫర్ట్ లో అవిష్కరించింది. అతి త్వరలో జరగనున్న 2016 ప్యారిస్ మోటార్ షో లో ప్రదర్శించడానికన్నా ముందుగా దీనిని సందర్శకులకు ప్రదర్శించింది. ఇది యూరోపియన్ మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఫోకస్ మరియు వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ వంటి ఉత్పత్తులకు గట్టి పోటీగా నిలవనుంది.

2017 హ్యుందాయ్ ఐ30

హ్యుందాయ్ మోటార్స్ యూరోపియన్ మార్కెట్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి విసృతమైన ప్రయత్నాలు చేస్తోంది. బారీ స్థాయిలో అమ్మకాలు నమోదు అవ్వాలనే ముఖ్య ఉద్యేశ్యంతో వీటిని డిజైన్ చేసినట్లు నూతన తరం ఐ30 డిజైన్ చెప్పకనేచెబుతోంది.

2017 హ్యుందాయ్ ఐ30

విభిన్నమైన వినియోగదారులను ఆకర్షించడానికి సరికొత్త డిజైన్ భాషను ఈ ఐ30 లో పరిచయం చేసారు. ఏ విధమైన అదనపు డిజైన్ హంగులకు పోకుండా నూతనత్వాన్ని ఇందులో పులిమినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

2017 హ్యుందాయ్ ఐ30

సాంకేతికంగా దీనిని మూడు పెట్రోల్ మరియు మూడు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందిస్తున్నారు. అందులో ప్రారంభ పెట్రోల్ ప్రారంభ వేరియంట్‌లో 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ అందిస్తున్నారు.

2017 హ్యుందాయ్ ఐ30

ఈ ఇంజన్ సుమారుగా 99బిహెచ్‌పి పవర్ మరియు 134ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గల ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తున్నారు.

2017 హ్యుందాయ్ ఐ30

అంతే కాకుండా ఇందులో 1.0-లీటర్ మూడు సిలిండర్ల టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను అందివ్వనున్నారు. ఇది సుమారుగా 118బిహెచ్‌పి పవర్‌ మరియు 171ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇది కేవలం 11.1 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

2017 హ్యుందాయ్ ఐ30

ఐ30 లోని మరో ఇంజన్ 1.4-లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 138బిహెచ్‌పి పవర్ మరియు 242ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

2017 హ్యుందాయ్ ఐ30

ఈ ఇంజన్‌ కోసం హ్యుందాయ్ ప్రత్యేకంగా అభివృద్ది చేసిన 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ వేరియంట్ ఐ30 కేవలం 8.90 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక ఆటోమేటిక్ వేరియంట్ అయితే కేవలం 0.3 సెకండ్లలోనే అందుకుంటుంది.

2017 హ్యుందాయ్ ఐ30

ఈ ఐ30 మూడు డీజల్ ఇంజన్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది. ఈ మూడు వేరియంట్లు కూడా 15, 16, 17 అంగుళాల చక్రాలను కలిగి ఉన్నాయి.

2017 హ్యుందాయ్ ఐ30

ఇంటీరియర్ పరంగా వీటిలో సరికొత్త తాకే తెర ఎల్‌సిడి డిస్ల్పే కలదు. అంతే కాకుండా ప్రారంభం వేరింయట్ కూడా 5-అంగుళాల కలర్ తెరను కలిగి ఉంది. ఇందులో రియర్ వ్యూవ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటి కలదు. ఆపిల్ కార్ ప్లే, ఆడ్రాయిడ్ ఆటో, న్యావిగేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

2017 హ్యుందాయ్ ఐ30

భద్రత పరంగా హ్యుందాయ్ ఈ ఐ30 లో ఆటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు డ్రైవర్ భీతిని అంచనా వేసే సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, రాడార్ అసిస్ట్ క్రూయిజ్ కంట్రోల్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ మరియు లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2017 హ్యుందాయ్ ఐ30

వెహికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉన్నందు వలన చాలా వరకు సంస్థలు వినియోగదారులను భారీ మోసం చేస్తున్నారు. అయితే దళారుల ద్వారా మోసపోకుండా మీ అంతట మీరే స్వతహాగా ఇన్సూరేన్స్ చేసుకునే అధునాతన విధానం మీకోసం...

2017 హ్యుందాయ్ ఐ30

  • మాల్యా చేసిన పాపాలకు పరిహారం.....!!

More from DriveSpark

Article Published On: Friday, September 9, 2016, 12:00 [IST]
English summary
2017 Hyundai i30 Unveiled Ahead Of Debut — Will India Be Next?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+