మారుతి సుజుకి సియాజ్ హైబ్రిడ్ కారుకు తొలి పోటీ
అత్యంత సరసమైన ధరతో అందుబాటులో ఉన్న ఏకైక హెబ్రిడ్ సెడాన్ మారుతి వారి సియాజ్. అయితే దీనికి పోటీగా 2017 వెర్నా సెడాన్ మిల్డ్-హైబ్రిడ్ సెడాన్‌ను హ్యుందాయ్ అభివృద్ది చేస్తోంది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఇండియన్ మార్కెట్లోకి 2017 వెర్నా సెడాన్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. అగ్ర స్థానంలో ఉన్న మారుతి వారి సియాజ్ హైబ్రిడ్ కారుకు పోటీగా తమ వెర్నాలో హైబ్రిడ్ పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తోంది.

దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో మారుతి అగ్ర స్థానంలో ఉంది. ఇదే సమయంలో హ్యుందాయ్ రెండవ స్థానంలో ఉంది. మారుతి వారి సియాజ్ ను టార్గెట్ చేస్తూ తమ నెక్ట్స్ జెనరేషన్ వెర్నాను హైబ్రిడ్ సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం చేయడానికి హ్యందాయ్ తయారవుతోంది.

2017 నాటికి విడుదల కానున్న హైబ్రిడ్ సెడాన్ వెర్నా, మారుతి సియాజ్ కు గట్టిపోటీనివ్వనుంది. ప్రస్తుతం దేశీయ సెడాన్ లలో అత్యుత్తమ మైలేజ్ ఇవ్వగల వాటిలో సియాజ్ మొదటి స్థానంలో ఉంది.

హ్యుందాయ్ ఈ 2017 వెర్నాలో రీజనరేటిటివ్ బ్రేకింగ్ అనే పరిజ్ఞానాన్ని అందిస్తోంది. దీని ద్వారా బ్రేకులను ఉపయోగించినపుడు డిస్క్ మరియు బ్రేక్ లైనర్ల మద్య ఉత్పత్తి అయ్యే శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి బ్యాటరీని చార్జ్ చేస్తుంది.

ఇందులోని బ్యాటరీ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్(ఐఎస్‌జి) అనే పరికరానికి అనుసంధానం చేయబడింది. తద్వారా బ్రేకుల ద్వారా ఉత్పత్తి అయ్యే పవర్ బ్యాటరీని చేరి అక్కడి నుండి ఐఎస్‌జి పరికరం ద్వారా ఇంజన్‌లోనికి ఎలక్ట్రిక్ మోటార్‌కు అందుతుంది.

ఈ వెర్నా లో యాక్సిలరేషన్ చేసే ప్రారంభంలో ఎక్కువ ఇంధనాన్ని తీసుకుంటుంది, అయితే ప్రయాణ సమయంలో ఐఎస్‌జి పరికరం ద్వారా పవర్ అందడం ద్వారా ఇంధన వినియోగం తగ్గి మైలేజ్ పెరిగే అవకాశం కలిగింది.

ఆటోమేటిక్ స్టార్ట్/స్టాప్ మరియు రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ ద్వారా కారు ఎక్కువ ఐడ్లింగ్ లో ఉండే అవకాశం చాలా తక్కువ. తద్వారా మైలేజ్ పెరుగుతుంది.

త్వరలో దేశీయంగా అమలులోకి రానున్న భారత్ 6 ఉద్గార నియమాలను పాటించే విధంగా ఇంజన్‌ను అభివృద్ది చేస్తోంది హ్యుందాయ్.

ప్రస్తుతం దేశీయంగా హ్యుందాయ్ వెర్నా మారుతి సుజుకి సియాజ్ హైబ్రిడ్ ద్వారా గట్టి పోటీని ఎదుర్కుంటోంది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల మీద ప్రభుత్వం ఇస్తున్న లాభాలు కూడా వీటి అమ్మకాలకు మరింత లబ్దిని చేకూర్చాయి.

ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, మిల్డ్ -హైబ్రిడ్ పరిజ్ఞానం మరియు ప్రభుత్వం అందించే లాభాలతో, 2017 హ్యుందాయ్ నెక్ట్స్ జెనరేషన్ వెర్నా ఆకర్షణీయమైన ధరతో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications








