2017 హ్యుందాయ్ వెర్నాను పరీక్షించిన చైనా....!!
తరువాత తరానికి చెందిన హ్యుందాయ్ 2017 వెర్నా కాన్సెప్ట్‌ను హ్యుందాయ్ మోటార్స్ 2016 బీజింగ్ మోటార్ షో లో ప్రదర్శించింది. అయితే ప్రస్తుతం ఈ కాన్సెప్ట్‌మను ప్రొడక్షన్‌కు సిద్దమైన ఉత్పత్తిగా పరీక్షలు నిర్వహించింది. దీని గురించి పూర్తి వివరాలు క్రింద గల స్లైడర్లలో...

హ్యుందాయ్ మోటార్స్ ఈ 2017 వెర్నా సెడాన్‌ను భారత్‌లో కన్నా ముందుగా చైనా మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

చైనాలో ప్రదర్శించిన ప్రొడక్షన్ రెడి వెర్నాను పరీశిలించినట్లయితే, ఇందులో ముందు వైపు స్పోర్ట్ హ్యాలోజన్ హెడ్ ల్యాంప్స్ మరియు స్టీలు చక్రాలను అందించారు.

2017 హ్యుందాయ్ వెర్నాలోని వేరియంట్లో ప్రొడెక్టర్ హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లు, ఫాగ్ ల్యాంపులు మరియు సరికొత్త డిజైన్‌లో ఉన్న అల్లాయ్ వీల్స్ కలవు.

కొలతల పరంగా 2017 వెర్నా లో పొడవైన వీల్ బేస్ సుమారుగా 2,600ఎమ్ఎమ్, 4380ఎమ్ఎమ్ పొడవు, 1728ఎమ్ఎమ్ వెడల్పు, 1460ఎమ్ఎమ్ ఎత్తు వంటి కొలతలతో విశాలమైన క్యాబిన్ స్పేస్‌ను కలిగి ఉంది.

2017 వెర్నాలో సాంకేతికంగా హ్యుందాయ్ 100బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.4 లీటర్ మరియు 123బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్‌లను అందించారు.

అంతేకాకుండా సరికొత్త హ్యుందాయ్ వెర్నా 1.4 లీటర్ మరియు 1.6 లీటర్ డీజల్ ఇంజన్‌లలో రానుంది.

అన్ని ఇంజన్ ఆప్షన్‌లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ల అనుసంధానంతో రానున్నాయి.

ఫీచర్ల పరంగా 2017 హ్యుందాయ్ వెర్నాలో సన్ రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, న్యావిగేషన్, లెథర్ అప్ హోల్‌స్ట్రే మరియు ఆరు ఎయిర్ బ్యాగులతో రానుంది.

2017 హ్యుందాయ్ వెర్నా విడుదల అయితే హోండా సిటి, మారుతి సియాజ్, వోక్స్‌వ్యాగన్ వెంటో మరియు స్కోడా ర్యాపిడ్ వంటి వాటికి పోటీగా నిలవనుంది.

దీనిని 2017 లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు, విడుదలప్పుడు దీని ధర ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ వెర్నా కన్నా కాస్త అధికంగా ఉండనుంది.

- ఆధిపత్యం కోసం పోరాటం: రెనో క్విడ్ ఏఎమ్‌టి వర్సెస్ మారుతి సెలెరియో ఏఎమ్‌టి


Click it and Unblock the Notifications