2017 స్విఫ్ట్ బ్రోచర్లు లీక్: ఇండియాకు కావాల్సిన మోడల్స్ ఏవో ఓ లుక్కేసుకోండి
జపాన్‌కు చెందిన 2017 సుజుకి స్విఫ్ట్ బ్రోచర్ అతి రహస్యంగా లీక్ అయ్యింది. ఇందులో నెక్ట్స్ జనరేషన్‌కు చెందిన అనేక వివరాలు వెల్లడయ్యాయి.
ఇండియన్ మార్కెట్లో విడుదలకు ఎంతగానో ఎదురు చూస్తున్న మారుతి వారి మరో మోడల్ 2017 స్విఫ్ట్. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్‌కు చెందిన జపాన్ ఆధారిత బ్రోచర్ అతి రహస్యంగా లీక్ అయ్యింది. ఈ బ్రోచర్‌లో నూతన స్విఫ్ట్ వేరియంట్లతో పాటు అనేక సాంకేతిక వివరాలు వెల్లడయ్యాయి. వాటి పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో.

2017 లో విడుదల కానున్న మారుతి సుజుకి నెక్ట్స్ జనరేషన్ స్విప్ట్ యొక్క డిజైన్ భాష బ్రోచర్‌లో వెల్లడైంది. స్వల్ప మార్పులకు గురైన ఫ్రంట్ డిజైన్ మరియు గ్రిల్‌ను గమనించవచ్చు

సుజుకి ఈ స్విఫ్ట్ యొక్క ఫ్రంట్ ఫేస్‌ను రీ డిజైన్ చేయడంతో పాటు కారు శరీరంలోని చివరి భాగం (సి-పిల్లర్) కాస్త తక్కువ ఎత్తు ఉండే విధంగా డిజైన్ చేయబడింది. మరియు అధునాతన టెయిల్ లైట్లు ఇందులో పరిచయమయ్యాయి.

జపనీస్ మార్కెట్లోకి విడుదలయ్యే ఈ నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ ఎనిమిది విభిన్న రంగుల్లో పరిచయం కానుంది.

విడుదలైన బ్రోచర్ ప్రకారం సరికొత్త స్విఫ్ట్ 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న కె-సిరీస్ మరియు 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న బూస్టర్ జెట్ పెట్రల్ ఇంజన్ వేరియంట్లలో లభించనుంది.

సాంకేతికంగా 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న కె-సిరీస్ ఇంజన్ గరిష్టంగా 83బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. అదే విధంగా 1.0-లీటర్ బూస్టర్ జెట్ ఇంజన్ గరిష్టంగా 110బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

జపాన్ మార్కెట్లో విడుదలయ్యే సరికొత్త 2017 స్విఫ్ట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో పరిచయమయ్యే అవకాశం ఉంది.

నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ ఆర్ఎస్ మోడల్ ఆప్షనల్‌గా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే అవకాశం ఉంది. మరియు ఎంచుకోదగ్గ స్విఫ్ట్ వేరియంట్లలో ఆర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ మరియు హైబ్రిడ్ టెక్నాలజీతో అందుబాటులో ఉండనున్నాయి.

దేశీయంగా 2017 నాటికి విడుదలయ్యే నెక్ట్ జనరేషన్ స్విఫ్ట్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లతో పాటు 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న మల్టిజెట్ డీజల్ ఇంజన్‌తో కూడా పరిచయం కానుంది.

గతంలో విడుదలైన 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఇంటీయర్ చిత్రాలు ఇందులోని ఫీచర్లను సూచిస్తున్నాయి. ఇంటీరియర్‌లో పూర్తి స్థాయిలో బ్లాక్ కలర్‌లో ఉన్న ఇంటీరియర్ డిజైన్, తాకే తెర గల ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, మరియు టిఎఫ్‌టి డిస్ల్పే గల ట్విన్ పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు కలవు.

ఈ 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ బాలెనో యొక్క అల్లాయ్ చక్రాలతో వస్తున్నట్లు తాజాగ లీకయిన బ్రోచర్ స్పష్టం చేస్తోంది. మరియు 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద ఆవిష్కరించిన స్విఫ్ట్ ఆధారంగా కూడా ఇది స్పష్టం అయ్యింది.

ఇండియన్ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ సెగ్మెంట్ లీడర్‌గా నిలనుంది. మారుతి సంస్థలోనే కాకుండా దేశీయంగా భారీగా విక్రయాలకు శ్రీకారం చుట్టనుంది. నూతనంగా డిజైన్ మార్పులతో పాటు స్పోర్టివ్ వెర్షన్‌లో రానుండటం ఇది మరింత ప్రత్యేకతను సంతరించుకుంటోంది.

గత కొన్నేళ్ల కాలం నుండి భారతీయ యువ కొనుగోలు దారులు స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్‌లను అమితంగా ఎంచుకుంటున్నారు. అందులో ఫియట్ అబర్త్ పుంటో మరియు వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ వంటి ఉత్పత్తులు మంచి ఫలితాలను సాధించాయి.

- మారుతి నుండి మరో శుభవార్త
- మారుతి నుండి శక్తివంతమైన హ్యాచ్ బ్యాక్ విడుదల ఖరారు
- ఇగ్నిస్ విడుదల, బుకింగ్స్ మరియు వేరియంట్లను ఖాయం చేసిన మారుతి

భారత్ అగ్ని-V అణు క్షిపణి పరీక్షలపై ప్రపంచ దేశాల్లో నెలకొన్న సందిగ్దత


Click it and Unblock the Notifications








