2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్‌కు సగర్వ స్వాగతం

మారుతి సుజుకి తమ 2017 స్విఫ్ట్ స్పోర్ట్‌ను మొదటిసారిగా ప్రపంచ ప్రదర్శన కోసం 2017 జెనీవా మోటర్ షో వేదిక మీద ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

By Anil

మారుతి సుజుకి ఇప్పుడు తమ నూతన ఉత్పత్తులను విడుదల చేసే పనుల్లో బిజీబిజీగా ఉంది. ప్రస్తుతం మారుతి 2017 స్విఫ్ట్ స్పోర్ట్, ఇగ్నిస్ క్రాసోవర్, బాలెనో ఆర్ఎస్ మరియు 2017 స్విఫ్ట్ డిజైర్ వంటి ఉత్పత్తుల విడుదల పనుల్లో తలమునకలై ఉంది. అయితే వీటిలో మొదటగా మారుతి తమ 2017 స్విఫ్ట్ స్పోర్ట్ వేరియంట్‌ను 2017 జెనీవా మోటార్ షో వేదిక ఆధారంగా ప్రపంచ ప్రదర్శన చేయనుంది.

2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్‌

జపాన్‌కు చెందిన సుజుకి మరియు దేశీయం ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సంయుక్తంగా 2017 స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌‌బ్యాక్ ను పూర్తి స్థాయిలో సిద్దం చేస్తోంది. ఇందుకోసం గతంలో పలుమార్లు ఈ దీనికి రహస్యంగా పరీక్షలు నిర్వహించింది మారుతి.

2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్‌

ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా 2017 లో జరిగే జెనీవా మోటార్ షో వేదిక ఆధారంగా ప్రపంచ ప్రదర్శనకు ఈ 2017 స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ ను సిద్దం చేస్తోంది మారుతి.

2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్‌

ప్రొడక్షన్ దశలో ప్రదర్శనకు రానున్న 2017 స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న డ్యూయల్ జెట్ డీజల్ మరియు 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల బూస్టర్ జెట్ టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌లు రానున్నాయి.

2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్‌

సరికొత్త స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ లోని డీజల్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు మిల్డ్ హైబ్రిడ్ పరిజ్ఞానం అనుసంధానం గల సివిటి ట్రాన్స్‌మిషన్ అనే రెండు ట్రిమ్ లలో అందుబాటులో ఉండనుంది.

2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్‌

పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే బాలెనొ ఆర్ఎస్ లో పరిచయం అవుతున్న అదే 1000సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ రానుంది.

2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్‌

గరిష్టంగా 100 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల ఇంజన్‌ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయబడింది.

2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్‌

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 2017 స్విఫ్ట్ స్పోర్ట్ లోని పెట్రోల్ టాప్ ఎండ్ వేరియంట్ రాడార్ బ్రేక్ సపోర్ట్ (RBS), ఆటో మేటిక్ హెడ్ ల్యాంప్స్ మరియు కర్టన్ ఎయిర్ బ్యాగులు వంటి ఫీచర్లతో రానుంది.

2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్‌

సరికొత్త స్విఫ్ట్ ఫ్రంట్ డిజైన్ మునుపటి పోల్చుకుంటే మరింత అట్రాక్టివ్‌గా ఆకర్షణీయంగా ఉండనుంది. వితారా బ్రిజా తరహాలో ఉన్నటువంటి రూఫ్ లైన్ ఇందులోను వచ్చే అవకాశం ఉంది.

2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్‌

ముందు వైపు డిజైన్‌లో పెద్ద హెక్సా గోనల్ గ్రిల్, ఎయిర్ ఇంటేకర్, బాలెనో హ్యాచ్‌బ్యాక్ ఆధారిత ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డే టైం రన్నింగ్ ల్యాంప్స్ వంటివి ఇందులో రానున్నాయి. ఇంటీరియర్ లో సరికొత్త డ్యాష్ బోర్డ్ మరియు ఫ్లాట్ స్టీరింగ్ కలవు.

2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్‌

ప్రస్తుతం స్విఫ్ట్ ‌కు పై స్థానంలో బాలెనొ ఉంది. ఇక ఈ 2017 స్విఫ్ట్ స్పోర్ట్ విడుదలైతే బాలెనొ కన్నా ఎగువ స్థానంలో నిలవనుంది.

2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్‌

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ను ప్రాథమికంగా గుజరాత్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది.

2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్‌

  • ఇండియన్ మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకి వారి 8 కార్లు
  • ఫిబ్రవరి 2017 లో విడుదల కానున్న సుజుకి ఇగ్నిస్
  • లేటెస్ట్ అప్‌డేట్స్‌తో 2017 మారుతి వ్యాగన్ఆర్

Article Published On: Thursday, November 24, 2016, 11:56 [IST]
English summary
Next Generation Maruti Suzuki Swift To Be Revealed At 2017 Geneva Motor Show
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+