నిస్సాన్ జిటి-ఆర్ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం
నిస్సాన్ ఇండియా 2017 ఎడిషన్‌కు చెందిన జిటి-ఆర్ సూపర్ కారు యొక్క ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించారు. 2017 జిటి-ఆర్ కు సంభందించిన బుకింగ్‌లను నిస్సాన్ డీలర్లు ఆహ్వానిస్తున్నారు. అయితే ఒక్క జిటి-ఆర్ బుకింగ్ చేసుకోవడానికి సుమరుగా 25 లక్షల రుపాయలను బుకింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

నిస్సాన్ వారి 2017 ఎడిషన్ జిటి-ఆర్ ను కొనుగోలు చేయడానికి ఎదురు చూస్తున్న కస్టమర్లు 2016 చివర వరకు ఎదురు చూడక తప్పదు. అయితే 2017 జిటి-ఆర్ ను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించింది నిస్సాన్. వినియోగదారులు తమ సందేహాలను 1-800-209-3456 నెంబర్‌కు ఫోన్ చేసి నివృతి చేసుకోవచ్చు.

2017 ఎడిషన్ జిటి-ఆర్ కు దేశ వ్యాప్తంగా ఉన్న నిస్సాన్ డీలర్ల వద్ద బుకింగ్‌లు అందుబాటులో లేవు. కేవలం ఎంచుకోదగ్గ డీలర్ల వద్ద మాత్రమే వీటికి సంభందించిన బుకింగ్‌లు అందుబాటులో ఉన్నట్లు నిస్సాన్ ప్రకటించింది.

2017 కు చెందిన నిస్సాన్ జిటి-ఆర్ లో 3.8-లీటర్ సామర్థ్యం గల వి6 ట్విన్ టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 561.98బిహెచ్‌పి పవర్ మరియు 637ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

2017 నిస్సాన్ జిటి-ఆర్ కేవలం 2.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది లాంబోర్గిని వారి అవెంతడోర్ కన్నా ఎక్కువ వేగంతో పరుగులు పెడుతుంది.

2017 జిటి-ఆర్ లో టైటానియమ్ లోహంతో తయారైన ఒపెన్ వాల్వ్ సిస్టమ్ గల ఎగ్జాస్ట్ వ్యవస్థ కలదు. నిస్సాన్ జిటి-ఆర్ లో 20-అంగుళాలు గల Y-స్పోక్ ఫోర్జ్‌డ్ అల్లాయ్ వీల్స్ కలవు.

2017 నిస్సాన్ జిటి-ఆర్ లో బ్లాక్, రెడ్, ఇవొరి లేదా ట్యాన్ టూరింగ్ లెథర్‌తో ఇంటీరియర్ డిజైన్ చేయబడింది. ఇక ఎక్ట్సీరియర్ విషయానికి వస్తే కట్సురా ఆరేంజ్, బ్లాక్ మెటాలిక్, గన్ మెటాలిక్, అల్టిమేట్ సిల్వర్, బ్లూ రేసింగ్, వైబ్రంట్ రెడ్, మరియు పియర్ల్ వైట్ ఆప్షన్‌లలో లభించును.

గతంలో మార్చి 2016 లో జరిగిన న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షో లో నిస్సాన్ సంస్థ తమ 2017 జిటి-ఆర్ ను ప్రదర్శించింది. నిస్సాన్ ఇండియన్ మార్కెట్లోకి అందించే మరిన్ని ఉత్పత్తుల గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

2017 నిస్సాన్ జిటి-ఆర్

2017 నిస్సాన్ జిటి-ఆర్

- నిర్మిస్తున్న చైనా మొట్టమొదటి ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్సు
- నాలుగవ తరం ప్రియస్ విడుదలకు సిద్దమవుతున్న టయోటా
- ప్రపంచ దేశాలన్నీ ఇండియా మీదనే ఆధారపడనున్నాయి...


Click it and Unblock the Notifications








