7 సీటర్ డస్టర్ ఎస్‌యువిని విడుదల చేయనున్న రెనో
ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ రెనో వారి డస్టర్ ఇండియన్ మార్కెట్‌లో ఉన్న ఎస్‌యువి సెగ్మెంట్లో అధిక వాటాను సొంతం చేసుకున్న విషయం విధితమే, అయితే వీలైనంత మార్కెట్‌ను తమ సొంతం చేసుకోవడానికి రెనో ఇండియా ఇప్పుడు తమ డస్టర్ 5 సీటర్ ఎస్‌యువిని 7 సీటర్ సామర్థ్యంతో అందివ్వడానికి సన్నాహాలు చేస్తోంది.

రెనో ఇండియా ఈ ఏడాది ప్రారంభంలో డస్టర్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. అయితే సబ్ నాలుగు మీటర్ల సెగ్మంట్లో ఎస్‌యువిని 7 సీటర్ సామర్థ్యంతో పూర్తిగా ఎస్‌యువి కుటుంబంలోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

2017 రెనో డస్టర్‌గా పిలువబడే ఈ ఎస్‌యువిని కొలతల పరంగా అన్ని విధాలుగా పెద్దగా ఉండేట్లు నిర్మించనున్నారు.

దీనిని నిస్సాన్ మరియు రెనో వారి సంయుక్త ఒప్పందంతో సిఎమ్‌ఎఫ్ మోడ్యులర్ వేదిక మీద డిజైన్ చేయనున్నారు.

దేశీయంగా అందుబాటులోకి వచ్చే 2017 డస్టర్ డీజల్ ఇంజన్ విషయంలో ఎలాంటి మార్పులు లేకుండా ప్రస్తుతం డస్టర్‌లో ఉన్న ఇంజన్‌నే అందివ్వనున్నారు.

డీజల్ ఇంజన్‌తో పాటు 1.2 లీటర్ టర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో కూడా రానుంది ఈ 2017 రెనో డస్టర్.

సరికొత్త 2017 రెనో డస్టర్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో పాటు ఫ్రంట్ వీల్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లతో రానుంది.

ప్రస్తుతం ఉన్న రెనో డస్టర్ ధరల కన్నా కొంచెం ఎక్కువ ధరతో పాటు రానుంది. అయితే చెల్లించే ధరకు అన్ని విధాలుగా సమంగా ఉండనుంది ఈ 2017 రెనో డస్టర్.

రెనో ఇండియా దీనిని 2017 లో విడుదల చేయనుంది, అయితే విడుదలకు ముందుగా దీని దేశీయంగా ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి.

- మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మమేంటి...?
Source: Auto Express


Click it and Unblock the Notifications








