ఇప్పుడు జపాన్‌లో త్వరలో భారత్‍‌కు: 2017 స్విఫ్ట్ సమగ్ర వివరాలు

జపాన్ మార్కెట్లోకి సుజుకి తమ 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ను ఆవిష్కరించింది. దేశీయ విపణివైపు అడుగులేయనున్న దీని గురించి పూర్తి వివరాలు....

By Anil

ప్రపంచ పరిచయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న 2017 స్విప్ట్ మొత్తానికి జపాన్‌లో విడుదలైంది. జపాన్ మార్కెట్ కోసం అభివృద్ది చేసిన జపాన్ స్పెక్ 2017 స్విఫ్ట్ ను సుజుకి ఆవిష్కరించింది. సుజుకి అనుబంధ సంస్థ మారుతి ఇండియన్ మార్కెట్లోకి ఈ నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్‌ను 2017 నాటికి విడుదల చేయనుంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లోకి మారుతి సుజుకి మొదటి స్థానంలో నిలిచింది. మారుతి ఈ ఖ్యాతిని గడించడంలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పుడు దీనికి అప్‌డేట్స్ నిర్వహించి నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్‌గా 2017 నాటికి మార్కెట్లోకి మళ్లీ విడుదల చేయనుంది. ఇది దాదాపు స్పోర్టివ్ లుక్‌ను సొంతం చేసుకుంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

నెక్ట్స్ జనరేషన్ 2017 స్విప్ట్ ను జపాన్ ఆవిష్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్లను ఆకర్షించడానికి 2017 లో జరగనున్న జెనీవా మోటార్ షో వేదిక మీద ప్రపంచ ప్రదర్శనకు తీసుకురానుంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

మూడవ తరానికి చెందిన స్విప్ట్‌గా దీనిని గుర్తించడానికి ఫ్రంట్ డిజన్‌ను మార్పులకు గురిచేస్తూ మొత్తం రూపాన్ని స్పోర్టివ్ గా తీర్చిదిద్దింది సుజుకి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో సుజుకి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి మరీ అభివృద్ది చేసింది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

దేశీయంగా పరిచయం కానున్న స్విఫ్ట్ విషయానికి వస్తే స్విఫ్ట్ ను బాలెనో ప్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేసిన గుర్తులను స్పష్టంగా గుర్తించవచ్చు. వచ్చే ఏడాది పండుగ సీజన్ నాటికి విడుదలకు సిద్దం చేయనున్నట్లు సమాచారం.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

2017 స్విఫ్ట్ లో రియర్ డిజైన్‌కు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న మోడల్‌కు పూర్తి భిన్నంగా టెయిల్ లైట్లు, బంపర్ మరియు రియర్ బూట్ లిట్ మీద చిన్న ఉబ్బెత్తుగా వచ్చి ఆకారం వంటి అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

ఇంటీరియర్ డిజైన్ మీద కూడా ఎక్కువ శ్రద్ద చూపినట్లు స్పష్టమవుతోంది. సరికొత్త స్టీరింగ్ వీల్ మరియు అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లతో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ ఆధారిత నియంత్రికలు, క్రూయిజ్ కంట్రోల్, ఇంజన్ స్టార్ట్ మరియు స్టాప్ బటన్ మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లతో రానుంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ లో ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, హ్యాలోజియన్ ఫాగ్ ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్ల నిర్మిత ఓఆర్‌విఎమ్, కీ లెస్ ఎంట్రీ, రియర్ ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు కూడా పరిచయం కానున్నాయి.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

ప్రస్తుతం జపనీస్ మార్కెట్లో ఆవిష్కరించబడిన 2017 స్విప్ట్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభిస్తుంది. అవి 1-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ మరియు 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 100బిహెచ్‌పి పవర్ మరియు 1.2-లీటర్ డీజల్ వేరియంట్ 89బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. మరియు డీజల్ వేరియంట్ మిల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడా పరిచయం అయ్యే అవకాశాలున్నాయి.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

2017 నాటికి దేశీయంగా విడుదలయ్యే స్విఫ్ట్ లో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్, 1.3-లీటర్ సామర్థ్యం గల డిడిఐఎస్ డీజల్ ఇంజన్‌లతో పరిచయం కానుంది. ఈ రెండు వేరియంట్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానున్నాయి.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

భద్రత పరంగా 2017 స్విఫ్ట్‌లో ఏడు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన, రివర్స్ పార్కింగ్ సెన్సార్లతో పాటు రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లు పరిచయం కానున్నాయి.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

ప్రస్తుతం కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో ఉన్న అన్ని మోడళ్లకు గట్టి పోటీనివ్వనున్న ఈ స్విప్ట్ ఇండియన్ విపణిలోకి ఐదు నుండి ఎనిమిది లక్షల వరకు ఎక్స్ షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

ఫ్రాన్స్ లో ప్రపంచపు మొట్టమొదటి సౌర ఫలక రహదారి ప్రారంభం

ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా ఫ్రాన్స్ దేశంలో సౌర ఫలక (సోలార్ ప్యానెల్)ల రహదారిని ప్రారంభించారు.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి నుండి మరో శుభవార్త

మారుతి సుజుకి తమ లైనప్‌లో ఉన్న వితారా బ్రిజా కు పై స్థానంలో మరో పెద్ద ఎస్‌యువి విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 27, 2016, 13:41 [IST]
English summary
India-Bound 2017 Suzuki Swift Breaks Cover In Japan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+