టిగువాన్ ఎస్‌యువిని దిగుమతి చేసుకుంటున్న వోక్స్‌వ్యాగన్

By Anil

వోక్స్‌వ్యాగన్ ఇండియా రెండు టిగువాన్ ప్రీమియమ్ ఎస్‌యువిలను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం వీటిని దేశీయంగా పరిశీలించి పరిక్షించడానికి దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఏ సమయంలో అయినా టిగువాన్ ఎస్‌యువిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

వోక్స్‌వ్యాగన్ రెండు టిగువాన్ ఎస్‌యువిలను దిగుమతి చేసుకున్న అంశాన్ని పరిశీలిస్తే దేశీయంగా రెండు విభిన్నమైన టిగువాన్ ఎస్‌యువి వేరియంట్లు అందుబాటులోకి రానున్నాయి అని తెలుస్తోంది.

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

వోక్స్‌వ్యాగన్ మొదటి సారిగా ఈ టిగువాన్ ఎస్‌యువిలను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. అయితే ప్రదర్శన వేదికలో సందర్శకుల తాకిడి ఆదారంగా దీని విడుదలను నిర్ణయించినట్లు తెలిసింది.

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

వోక్స్‌వ్యాగన్ ఈ టిగువాన్ ఎస్‌యువిని ఎమ్‌క్యూబి వేదిక మీద అభివృద్ది చేసింది. పస్టాట్ మరియు స్కోడా ఆక్టావియా తరహాలో దీని అభివృద్ది జరిగింది.

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

వోక్స్‌వ్యాగన్ వారి క్రాస్ కూపే జిటిఇ ప్రేరణతో బోల్డ్ మరియు అగ్రెసివ్ భాషలో టిగువాన్ ఎస్‌యువిని డిజైన్ చేసారు.

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

ట్విన్ స్లాట్ క్రోమ్ గ్రిల్‌లో భాగంగా ఎల్‌ఇడి లైట్లను ఇముడింపచేయడం జరిగింది. కండలు కలిగిన పెద్ద బంపర్, విశాలమైన ఎయిర్ ఇంటేకర్ మరియు క్రింది భాగంలో అడ్డంగా ఫాగ్ లైట్లు కలవు.

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

ఫీచర్ల పరంగా ఇందులో మూడు జోన్ల ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ప్యానరమిక్ సన్ రూఫ్, ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం ఉన్న ఫ్రంట్ సీట్, మరియు మెసేజ్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

వినోదం కోసం ఇందులో వోక్స్‌వ్యాగన్ కార్- నెట్ యాప్ కనెక్ట్, ఫెండర్ ప్రీమియమ్ ఆడియో సిస్టమ్, 400 వాట్ ఆంప్లిఫైర్ మరియు తొమ్మిది స్పీకర్లు ఇందులో ఉన్నాయి.

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

వోక్స్‌వ్యాగన్ ఈ టిగువాన్ ఎస్‌యువిలో భద్రత పరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. అందులో ఆటోమేటిక్ పోస్ట్ కొల్లిషన్ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ అసిస్ట్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్, సిటి ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు పెడస్ట్రేన్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

ఏడు ఎయిర్ బ్యాగులు, మోకాళి ఎయిర్ బ్యాగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఏరియా వ్యూవ్, ప్రమాదం జరిగే సంఘటనకంటే ముందుగా ప్రయాణికులను సేవ్ చేయడం, సైట్ అసిస్ట్ (లేన్ చేంజింగ్ అసిస్ట్)

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువిని ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయితే ఆడి క్యూ3, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 మరియు రేంజ్ రోవర్ ఎవోక్ వంటి వాహనాలకు దేశీయంగా గట్టి పోటీని ఇవ్వనుంది.

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

  • భద్రత పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన వోక్స్‌వ్యాగన్ టిగువాన్: పూర్తి వివరాలకు
  • 2017 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యువి

    • వోక్స్‌వ్యాగన్: ఇండియన్ మార్కెట్ కోసం పోలో ఆధారిత కాంపాక్ట్ SUV
    • సరికొత్త స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసిన కవాసకి: ధర మరియు ఇతర వివరాలు
    • సర్జికల్ స్ట్రైక్స్‌లో కీలక పాత్ర పోషించిన ధృువ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికర విషయాలు

More from DriveSpark

Article Published On: Tuesday, October 4, 2016, 18:45 [IST]
English summary
Volkswagen Imports Tiguan SUV For Homologation For Indian Market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+