ప్రాణాలు కాపాడాల్సిన ఎయిర్ బ్యాగ్ ప్రాణం తీసింది

By Anil

హోండా వారి సివిక్ కారును డ్రైవ్‌ చేస్తున్న మహిళ పొరపాటున మెర్సిడెస్ బెంజ్ కారును స్వల్పంగా ఢీ కొట్టింది. తద్వారా తాను ప్రయాణిస్తున్న హోండా సివిక్ కారులోని డ్రైవర్‌ ఎయిర్‌ బ్యాగ్ విచ్చుకుని ఆమె మృతికి కారణమయ్యింది.

 ప్రాణాలు కాపాడాల్సిన ఎయిర్ బ్యాగ్ ప్రాణం తీసింది

ఈ సంఘటన జూన్ 26, ఆదివారం నాడు మలేషియాలో చోటు చేసుకుంది. ఇది జరిగిన కొద్ది రోజుల అనంతరం హోండా మోటార్స్ మలేషియా సుమారుగా 1,45,000 కార్లను ఎయిర్ బ్యాగుల సమస్య కారణంగా రీకాల్ చేసింది. హోండా కార్లలోని ఎయిర్ బ్యాగ్ ఇన్ప్లాయేటర్స్ సరిగా పనిచేయక పోవడం వలన రీకాల్ చేసినట్లు ప్రకటించింది.

ఎయిర్ బ్యాగులు పేళుతుండటం వలన ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 11 మంది వరకు చనిపోయినట్లు తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ కార్లలో జరిగిన ఎయిర్‌బ్యాగుల ప్రమాదం వలన చనిపోయినట్లు తెలిసింది.
Also Read: ఎయిర్ బ్యాగులు ఎన్ని రకాలు ? అవి ఎలా పనిచేస్తాయి ?
ప్రాణాలు కాపాడాల్సిన ఎయిర్‌బ్యాగులు మృత్యుకారకాలుగా మారడానికి కారణం, ఎయిర్ బ్యాగులను సరఫరా చేసే సంస్థ టకాటా కార్ప్ ఎయిర్‌బ్యాగుల తయారీలో ప్రొపెల్లంట్ అనే పదార్థాన్ని వినియోగించారు. దీని ద్వారా సరిగ్గా విచ్చుకోవాల్సిన ఎయిర్‌బ్యాగులు ప్రమాదం జరిగినప్పుడు ప్రేళుతున్నాయి. తద్వారా ప్రయాణికులు ఎయిర్‌బ్యాగుల ద్వారా మరణిస్తున్నారు.
Also Read: ప్రపంచంలో కెల్లా అత్యంత భయంకరమైన ఎయిర్‌పోర్ట్ రన్‌వేస్
ఈ కారణం చేతి టకాటా సంస్థకు చెందిన ఎయిర్‌బ్యాగులను వినియోగించిన సుమారుగా కొన్ని లక్షల కార్లను రీకాల్ చేసారు. అందులో ఎక్కువగా అమెరకాకు చెందిన కార్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణం వలన ఒక్క అమెరికాలోనే 10 మంది మృత్త్యువాత పడ్డారు.

Article Published On: Monday, June 27, 2016, 18:03 [IST]
English summary
Exploding Airbag In Honda Civic Kills Driver
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+