ఆల్ న్యూ టయోటా ఫార్చ్యూనర్: త్వరలో దేశీయంగా విడుదల
టయోటా మోటార్స్ మొదటి సారిగా ఇండియన్ రహదారుల్లో తమ సరికొత్త ఫార్చ్యూనర్ ఎస్‌యువిని పరీక్షించింది. గత ఏడాది అక్టోబరులో టయోటా ఈ ఫార్చ్యూనర్ ఎస్‌యువిని ఆర్&డి అవసరాల కోసం దిగుమతి చేసుకుంది. అయితే టయోటా దీనిని ఇండియా కన్నా ముందుగా థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో...

టయోటా మోటార్స్ అతి త్వరలో విడుదల చేయనున్న ఈ నూతన ఫార్చూనర్ ఎస్‌యువిలో సరికొత్త క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ మరియు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అందించింది.

అంతర్జాయ మార్కెట్ కోసం అభివృద్ది చేస్తున్న టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యువిలో 2.4-లీటర్ మరియు 2.8-లీటర్ డీజల్ ఇంజన్ అదే విధంగా 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తున్నారు.

దేశీయంగా అందుబాటులోకి వచ్చే 2016 ఫార్చ్యూనర్‌లో 148బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 2.4-లీటర్ డీజల్ ఇంజన్‌ను అందివ్వనుంది.

175 బిహెచ్‌పి పవర్ మరియు 450ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 2.8-లీటర్ డీజల్ ఇంజన్‌ను కూడా అందిస్తున్నారు. సరికొత్త ఫార్చ్యూనర్‌లలో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‍బాక్స్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా వాహన కాలుష్య నియమాలు కఠిన అవుతున్న నేపథ్యంలో ఈ సరికొత్త ఫార్చ్యూనర్‌లో సరికొత్త ఇంజన్‌లను అందివ్వడానికి మరింత పెట్టుబడి పెట్టనుంది.

అయితే పరీక్షల కోసం రోడ్డెక్కిన ఫార్చ్యూనర్‌ను చూస్తే దీనిని ఇంకా అభివృద్ది చేయనున్నట్లు తెలుస్తోంది.

మొట్టమొదటి ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్సును నిర్మిస్తున్న చైనా
ఎస్‍యులకు ఫిదా అయిపోయిన ఇండియన్స్
ఫోటోలు:


Click it and Unblock the Notifications








