హెక్సా ద్వారా నూతన శకాన్ని ఆరభించనున్న టాటా మోటార్స్
విదేశీ ఆటోమొబైల్ సంస్థలకు ధీటుగా టాటా మోటార్స్ కార్ల రంగంలో అత్బుతమైన ఉత్పత్తులను ప్రవేశపెడుతోంది. అందులో టాటా టియాగో మరియు అతి త్వరలో విడుదల కానున్న టాటా హెక్సా.
టాటా మోటార్స్ ఈ హెక్సా క్రాసోవర్‌ను 2015 లో జరిగిన జెనీవా మోటార్ షో మరియు 2016 ప్రారంభంలో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. టాటా మోటార్స్ ఈ హెక్సా క్రాసోవర్‌ను వచ్చే జూన్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అందుకోసం నేడు డ్రైవ్‌స్పార్క్ తెలుగు పాఠకుల కోసం టాటా హెక్సా క్రాసోవర్ గురించి ముఖ్యమైన విషయాలను క్రింది కథనం ద్వారా అందిస్తోంది.

ల్యాండ్‌రోవర్ వారి శ్రమ, పరిజ్ఞానం మరియు పరికరాలతో తయారవుతున్న టాటా మోటార్స్ వారి మొదటి ఉత్పత్తి ఇది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థకు టాటా మోటార్స్ మాతృ సంస్థగా ఉంది.

ఈ హెక్సా క్రాసోవర్ కారును టాటా మోటార్స్ వారి అరియా కారును అభివృద్ది చేసిన ఫ్లాట్ ఫాం మీద ఉత్పత్తి మీద అభివృద్ది చేస్తున్నారు. అయితే దీనిని విడుదల చేసే సమయంలో అరియా కారు స్థానంలో మార్కెట్లోకి దీనిని ప్రవేశపెడుతున్నట్లు తెలపనున్నారు.

టాటా మోటార్స్ ఉత్పత్తి చేసిన ముందు వైపున బోల్డ్ స్టేన్స్, స్పోర్ట్ తరహా శైలి మరియు కండలు తిరిగిన రూపంతో డిజైన్ గల వాటిలో ఇదీ కూడా ఉత్పత్తిగా ఉంది.

టాటా మోటార్స్ వెనుక వైపున ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ బంపర్ మరియు స్పాయిలర్ వంటివి కలవు.

ఇంటీరయర్‌లో ఇందులో క్యాప్టెన్ సీట్లను అందిచారు వీటికి లెథర్ తొడుగులు మరింత ప్రత్యేకతను జోడించాయి.
క్యాప్టెన్ సీట్లు అనగా: వరుసలో ఉన్న సీటు పొడవుగా కాకుండా ఒక్కొక్క ప్రయాణికుడికి విడి విడిగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఎటువంటి అనుసంధానం ఉండదు.

ఇందులో ప్రీమియర్ అనుభూతిని పొందడానికి క్యాబిన్ లోపల డ్యూయల్ టోన్ ఫినిష్ ఇంటీరియర్, ఎల్‌ఇడి లైట్లు మరియు బెడ్ ల్యాంప్ తరహాలో కాంతిని వెదజల్లే మూడు లైట్లు కలవు.

ఇందులో ఫీచర్లు పరంగా తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, టెర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, న్యావిగేషన్ మరియు పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇందులో కలవు.

భద్రత పరంగా ఇందులో టాటా మోటార్స్ వారు ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటి లాంగ్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్, బ్రేక్ అసిస్ట్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటివి ఇందులో అందిస్తున్నారు.

టాటా మోటార్స్ సఫారి స్టార్మ్ వారికోర్ 400 మోడల్‌లో వినియోగించిన 2.2-లీటర్ నాలుగు సిలిండర్ల వారికోర్ డీజల్ ఇంజన్‌ను అందిస్తున్నారు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 154 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ వరకు గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్
టాటా మోటార్స్ ఈ హెక్సా క్రాసోవర్ ఎస్‌యువిలో వినియోగించిన 2.2-లీటర్ ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ఈ హెక్సా ఎస్‌యువిలోని ఇంజన్ పవర్ వెనుక చక్రాలకు అందుతుంది. మరియు ఆప్షనల్‌గా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కల్పించారు.
ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్: ఇంజన్ విడుదల చేసే పవర్ మొత్తం వాహనంలోని నాలుగు చక్రాలకు అందితే దానిని ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అంటారు.

టాటా హెక్సా కొలతలు
టాటా హెక్సా క్రాసోవర్ ఎస్‌యువి రూపం ఎంతో అత్భుతంగా ఉంటుంది. అందుకు దీని కొలతలు ఎంతగానో కారణమయ్యాయని చెప్పవచ్చు.
- పొడవు: 4746 ఎమ్ఎమ్
- వెడల్పు: 1895 ఎమ్ఎమ్
- ఎత్తు: 1780 ఎమ్ఎమ్
- వీల్ బేస్: 2850 ఎమ్ఎమ్

విడుదల
టాటా మోటార్స్ తమ హెక్స్ క్రాసోవర్ ఎస్‌యువి వాహనాన్ని ఈ ఏడాది జూన్‌లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

పోటీ
అన్ని అంశాల పరంగా ఉన్న ఈ హెక్సా క్రాసోవర్ ఎస్‌యువి ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయితే మహీంద్రా అండ్ మహీంద్రా వారి ఎక్స్‌యూవీ500 వాహనానికి గట్టి పోటీగా నిలవనుంది.


Click it and Unblock the Notifications








